చనిపోతూ ఈ మహిళ రాసిన లెటర్ చూసి పోలీసులే బాధపడ్డారు..! కంటతడి తెప్పిస్తున్న సంఘటన..!

Ads

గతంలో ఆడవాళ్ళ మీద ఎన్నో తప్పుడు పనులు జరిగేవి. ఆడవాళ్ళని కొట్టడం, కట్నంలాంటి విషయాల పేరుతో వాళ్లని ఇబ్బంది పెట్టడం వంటివి జరిగేవి. సమయం మారింది. దాంతో పాటు సమాజం కూడా మారింది. కానీ ఇవన్నీ మాత్రం ఇంకా మారలేదు. ఎక్కడో ఒకచోట ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లు కట్నకానుకలు అనే విషయంలో ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. తమ కూతురు సంతోషంగా ఉండాలి అని ఎంతో ఆశతో తల్లిదండ్రులు అత్తారింటికి అమ్మాయిని పంపిస్తారు.

women heart touching letter

కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను అనే ఆనందంతో అమ్మాయి కూడా అత్తారింటికి సంతోషంగా వెళుతుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అందరి పరిస్థితి అలాగే ఉండదు. బాధలు పడే అమ్మాయిలు కూడా ఉంటారు. ఇటీవల ఒక అమ్మాయికి అలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే, మాండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకా లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ కుమారి వయసు 26 సంవత్సరాలు. 2022 లో ప్రేమ కుమారికి మైసూరుకు చెందిన రాఘవేంద్రతో పెళ్లి జరిగింది.

representative image

పెళ్లి సమయంలో 5 లక్షల కట్నాన్ని, 150 గ్రాముల బంగారాన్ని ప్రేమ కుమారి కుటుంబ సభ్యులు రాఘవేంద్ర కుటుంబానికి ఇచ్చారు. పెళ్లైన 3 నెలల వరకు ప్రేమ కుమారి సంతోషంగా ఉంది. తర్వాత రాఘవేంద్ర కుటుంబం ఆమెకి వాళ్ళ అసలు రూపం బయట పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా కట్నం కావాలి అని, ఒకవేళ డబ్బులు లేదు అంటే ఆమెకి వాళ్ళ ఇంట్లో చోటు లేదు అని రాఘవేంద్ర ప్రేమ కుమారిని ఇబ్బంది పెట్టేవాడు. దాంతో ప్రేమ కుమారి పుట్టింటికి వెళ్ళిపోయింది.

Ads

women heart touching letter

అక్కడే ఉండి చదువుకుంటోంది. కానీ మంచివాడిగా తన భర్త చెప్పిన మాటలని అర్థం చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయింది. దాంతో 5 పేజీల లెటర్ రాసి, బలవన్మరణానికి పాల్పడింది.”పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అతని నిజ స్వరూపం బయటికి వచ్చింది. ఇంకా కట్నం కావాలి అంటూ అడగడం మొదలుపెట్టాడు. 64 లక్షల రూపాయలు తీసుకురావాలి అని, లేకపోతే చంపేస్తాను అని బెదిరించి నన్ను పుట్టింటికి పంపించాడు. ఇక్కడికి వచ్చాక నేను చదువుకున్నాను. లాయర్ కావాలి అని ఉన్న నా కల నెరవేరుతుంది. కానీ అతడి కోపాన్ని నేను భరించలేకపోతున్నాను.”

women heart touching letter

“ఎల్లప్పుడూ భయంతో నేను బతకలేను. మంచివాడిగా నటించి అతను నన్ను మోసం చేశాడు. నేను కూడా డబ్బు గల కుటుంబానికి చెందిన అమ్మాయినే. కానీ అతనికి డబ్బులు ఇవ్వాలి అని నాకు లేదు. అలా అని అతనితో కలిసి బతకాలి అని కూడా లేదు. నాకు చనిపోవాలి అనే ధైర్యం లేదు. బతకాలి అనే కోరిక లేదు” అంటూ ఉరి వేసుకుంది. ప్రేమ కుమారి తల్లిదండ్రులు ఈ విషయం మీద ఫిర్యాదు ఇవ్వడంతో, రాఘవేంద్ర మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రేమ కుమారి రాసిన లెటర్ చూసి పోలీసులు సైతం బాధపడ్డారు.

ALSO READ : పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Previous articleపెళ్లి తరవాత భర్తల్లో.. ఈ మార్పులు రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసా…?
Next articleకొత్త వాహనం కొన్నప్పుడు.. నిమ్మకాయలని టైర్ కింద పెట్టి ఎందుకు తొక్కించాలి..? దాని వెనుక వున్న కథ ఇదే..!