అప్పుడు అమృతం సీరియల్‌లో చూపించిందే… ఇప్పుడు హైదరాబాద్‌లో నిజం అయిందిగా.?

Ads

అమృతం సీరియల్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అమృత రావు, ఆంజనేయులు, సర్వం పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. ఈ ఎపిసోడ్స్ కి ఇప్పటికి కూడా రిపీటెడ్ వాల్యూ ఉంది. ఎంతో మంది ఈ ఎపిసోడ్స్ మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. అమృత రావు పాత్రలో మొదట శివాజీ రాజా, ఆ తర్వాత నరేష్, ఆ తర్వాత హర్షవర్ధన్ చేశారు. కానీ అందరికీ ఎక్కువగా గుర్తుండిపోయింది మాత్రం హర్షవర్ధన్ పాత్ర మాత్రమే.

scene from amrutham

అమృత రావు అంటే సడన్ గా హర్షవర్ధన్ గుర్తొస్తారు. ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు గారు నటించారు. సర్వం పాత్రలో వాసు ఇంటూరి నటించారు. అమృతం కి సీక్వెల్ వచ్చినా కూడా అమృతం సీరియల్ అంత పెద్ద హిట్ ఇది అవ్వలేదు. ఒక చిన్న సమస్యను తీసుకొని, దానిని ఫన్నీగా చూపించి, ఆ రోజు ఎపిసోడ్ డిజైన్ చేసుకుంటారు. ఈ సమస్యలు అన్నీ కూడా నిజ జీవితంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలు కావడంతో ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

what happened in hyderabad lulu mall

అయితే, “అమృతం సీరియల్ లో అప్పుడు చూపించిన ఒక సంఘటన ఇప్పుడు నిజంగానే జరిగింది” అంటూ ఒక ఎపిసోడ్ లోని ఒక సీన్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఒక సారి సూపర్ మార్కెట్ కి వెళ్లిన అమృత రావు, అక్కడ వస్తువుల్ని చూసి, అందులో కొన్ని తెరిచి అలాగే పడేస్తాడు. అలా చాలా వస్తువులని చూస్తాడు. ఇటీవల హైదరాబాద్ లో కొత్తగా తెరిచిన లులు మాల్ లో కూడా దాదాపు ఇలాగే జరిగింది.

what happened in hyderabad lulu mall

మాల్ సందర్శించడం కోసం వచ్చిన చాలా మంది హైదరాబాద్ వాసులు సగం తిన్న పదార్థాలు అక్కడ పడేసి, తినేశాక ప్యాకెట్స్ పడేసి, మాల్ అంతా చిందరవందరగా చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. చూసిన వారందరూ కూడా, “మన హైదరాబాద్ పరువు మనమే తీసుకుంటున్నాం” అని తిట్టారు. అయితే ఇప్పుడు అమృతం సీరియల్ లో కూడా దాదాపు ఇలాంటి సీన్ ఉండడంతో ఆ సీన్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

watch video :

Previous article“16 ఏళ్లకే నువ్వు దూరమవుతావు అని తెలిసి ఉంటే…అలా చేసి ఉండే దాన్ని”.. అంటూ కూతురు గురించి హీరో భార్య ఎమోషనల్ పోస్ట్.!
Next articleతెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఒంటరి పోరుకి సిద్ధమంటున్న YSRTP …షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.