తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఒంటరి పోరుకి సిద్ధమంటున్న YSRTP …షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారంటే.?

Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ టీపీ తరఫున షర్మిల సిద్ధమవుతోంది. పాలేరు నుంచి బరిలోకి దిగనున్న షర్మిల ఈ మేరకు త్వరలోనే పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలో షర్మిల తన పార్టీ కార్యకర్తలతో సమావేశం జరిపే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి పోటీకి దిగడానికి షర్మిల సిద్ధపడడమే కాకుండా ఆరుగురితో ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత…తెలంగాణ రాజకీయాలలో హై టెన్షన్ నెలకొంది. త్రిముఖ పోరుకు సిద్ధపడుతున్న అగ్ర పార్టీల మధ్యలో నేను సైతం అంటూ వైఎస్ఆర్ టీపీ తో కదన రంగంలోకి దూకడానికి సిద్ధపడుతోంది షర్మిల. ఈనెల 12 నుంచి పూర్తిస్థాయి లో రాబోయే ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించడానికి షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Ads

ఇక షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. మరోపక్క ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం కోసం పూర్తిస్థాయిలో షర్మిల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదు. దీంతో ఒంటరిగా అయినా సరే పోరుకు సై అంటుంది షర్మిల.

watch video:

Previous articleఅప్పుడు అమృతం సీరియల్‌లో చూపించిందే… ఇప్పుడు హైదరాబాద్‌లో నిజం అయిందిగా.?
Next articleక్రికెట్ మ్యాచ్ మధ్యలో వచ్చే ఆ ఒక్క చిన్న యాడ్ కోసం ఎంత ఖర్చు తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.