చంద్రబాబుకు వైద్య పరీక్షలు…హెల్త్ బులిటెన్ లో ఏముందంటే.? జైలు వాతావరణం వల్లే ఆ సమస్యా.?

Ads

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన మరొకసారి ఈరోజు అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆయన వెంటనే పరీక్షించిన వైద్యులు తగిన చికిత్స అందించారు కానీ కొన్ని మందులు కూడా వాడాలని వారు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం పై జైలు అధికారులు హెల్త్ బులిటన్ని కూడా విడుదల చేశారు.

చంద్రబాబుకు చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ ఉందని వైద్యులు గుర్తించినట్లు వివరించిన జైలు అధికారులు…ఎలర్జీ గురించి తెలిసిన వెంటనే డెర్మటాలజీ స్పెషలిస్ట్లను కూడా పిలిపించామని పేర్కొన్నారు. వైద్యులు సూచించిన విధంగా మందులు అందించడం జరుగుతుందని ప్రస్తుతానికి చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది కాబట్టి ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని డిప్యూటీ జైల్ సూపర్నెంట్ అయిన రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

Ads

డాక్టర్ నివేదిక ప్రకారం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూడండి..

  • బీపీ -> 140/80
  • పల్స్ -> 87
  • టెంపరేచర్ -> నార్మల్
  • Spo2 -> 97
  • Heart -> s1 s2
  • లంగ్స్ -> క్లియర్
  • ఫిజికల్ యాక్టివిటీ -> good

అయితే ఆయనకు ఎందుకు బాగ లేకుండా వచ్చింది అంటే గత కొద్దికాలంగా ఎండ తీవ్రతగా ఉంది.. ఈ కారణంతో డిహైడ్రేషన్ తలెత్తడం వల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నని వైద్యులు సూచించారు. ఈ మేరకు వాళ్ళు తగు చికిత్స కూడా అందించారు కానీ మళ్ళీ తిరిగి గురువారం నాడు చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు.

image credits: asianetnews

గత కొద్ది కాలంగా చర్మ సంబంధిత ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్న చంద్రబాబుకు తిరిగి ఎలర్జీ రావడంతో వైద్యులు పూర్తి పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఎండా మరియు జైలు వాతావరణం పడకపోవడం వల్ల ఇటువంటి సమస్య వచ్చింది అని టాక్.

Previous article“లియో” సెన్సార్ రిపోర్ట్..! హిట్టా..? ఫట్టా..?
Next articleGOD REVIEW : సస్పెన్స్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన “గాడ్” ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.