Ads
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మకు శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈనాడు.నెట్ కథనం ప్రకారం, హైదరాబాదు నుంచి రోడ్డు మార్గాన తమ వెహికల్స్ లో ఒంగోలు కి వెళ్తుండగా.. తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద విజయమ్మ వాహనం యాక్సిడెంట్ కి గురి అయింది.
వారి ముందు ప్రయాణిస్తున్న వాహనం సడన్ గా నెమ్మదించడంతో డ్రైవర్ అనుకోకుండా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న వారి వెహికల్ సడన్ బ్రేక్ గమనించకపోవడంతో నేరుగా వచ్చి విజయమ్మ వాహనానికి వెనుక ఢీకొంది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం స్వల్పంగా డ్యామేజ్ అయింది. అయితే అదృష్టం కొద్దీ ఇప్పుడు మాత్రమే డామేజ్ అయింది విజయమ్మతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఎవరికీ ఎటువంటి దెబ్బలు తగల్లేదు.
Ads
గత కొద్దికాలంగా అనారోగ్యానికి గురి అయిన విజయమ్మ సోదరి అత్త, టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించడానికి విజయమ్మ ఒంగోలు కి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈరోజు రాత్రికి ఒంగోల్ లోనే బస చేసి శనివారం ఉదయం తిరిగి విజయమ్మ హైదరాబాదుకు బయలుదేరుతారు. ప్రస్తుతం విజయమ్మ జగన్ దగ్గర కాకుండా ఆమె కూతురు షర్మిల దగ్గర ఉంటున్నారు.