ఆ పాట వల్ల “భగవంత్ కేసరి” కి 3.5 కోట్లు నష్టం వచ్చింది అంట…పండగకి యాడ్ చేస్తారా.?

Ads

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తొలి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల కీలక పాత్రలో నటించింది.

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్ అందుకున్న బాలయ్య, ఈ సినిమాతో హ్యాట్రిక్  హిట్ అందుకుంటారని టాక్ వినిపిస్తోంది. భగవంత్ కేసరి మూవీలో ఒక సాంగ్ ను తొలగించారని నెట్టింట్లో ఒక వార్త వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..నట సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాకి ఇప్పటివరకు ఫ్లాప్ ఎదుర్కొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీలకి తండ్రి పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న అనిల్ రావిపూడి ఒక ప్రత్యేక పాటను పెట్టారంట. అది కూడా బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘మంగమ్మ గారి మనవడు’ లోని ‘దంచవే మేనత్త కూతురా’ పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట చిత్రీకరణ కోసం దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.
నెట్టింట్లో వస్తున్న వార్తల ప్రకారం, దంచవే మేనత్త కుతురా పాటను మూవీ నుండి డిలీట్ చేశారట. రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’ సినిమాను బాలకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి సన్నిహితులు స్పెషల్ స్క్రీనింగ్‌లో చూశారట. మూవీ చూసిన తరువాత దంచవే మేనత్త కూతురా సాంగ్ మూవీలో నాన్ సింక్ గా ఉందని అనిల్ రావిపూడికి సూచించారంట. దాంతో దర్శకుడు ఈ సాంగ్ ను తొలగించారని సమాచారం. దీంతో ఈ సాంగ్ కి పెట్టిన 3.5 కోట్లు లాస్ అయినట్లే అంటున్నారు.

Ads

Also Read: BHAGAVANTH KESARI REVIEW : “భగవంత్ కేసరి”తో బాలయ్య హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!!

 

 

Previous articleIND vs BAN: నేడే బాంగ్లాదేశ్ తో మ్యాచ్…ఆ ముగ్గురుతో డేంజర్ అంటూ “రోహిత్” కి హెచ్చరిక.!
Next article“హాయ్ నాన్న” ఆ తెలుగు సినిమా రీమేకా.? టీజర్ చూస్తే… ఆ “నాగార్జున” సినిమా స్టోరీ లాగా అనిపిస్తుందిగా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.