“గుప్పెడంత మనసు” లో సరికొత్త ట్విస్ట్…మహేంద్రను కలసిన ఆ కొత్త వ్యక్తి ఎవరు?

Ads

గుప్పెడంత మనసు సీరియల్ మరోసారి అభిమానుల్ని ఆకట్టుకుంది. రిషి తల్లి జగతి చనిపోవడంతో, మహేంద్ర, రిషి ఆమె జ్ఞాపకాలలోనే ఉంటారు. ఇక వసుధర కాలేజీ ఎండీగా బాధ్యతలు తీసుకుంటుంది. ఆమె ఎండీ కావడాన్ని జీర్ణించుకోలేని దేవయాని, శైలేంద్ర తమ కుట్రలు ఫలించలేదని  మాట్లాడుకుంటారు.

దేవయాని, శైలేంద్ర మాటలు విన్న రిషి విని, వసుధర గురించేనా అని ప్రశ్నిస్తాడు. ఆమె ఎండీగా పనిచేయగలదో లేదో అని అనుకుంటున్నామని అంటారు. ఆ తరువాత రిషి, వసుధర, మహేంద్ర కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్తారు. అక్కడ మహేంద్రను ఒకరు కలుస్తారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎండీ వసుధర క్యాబిన్‌లోకి దేవయాని, శైలేంద్ర వెళ్ళి, ఆమెను ఇబ్బందిపెట్టే విధంగా మాట్లాడతారు. వాటిని భరించలేని వసు ఇద్దరినీ అక్కడి నుండి వెళ్లిపోమంటుంది. దాంతో వసుధారకు శైలేంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. శైలేంద్ర కుట్ర చేయడంతో కాలేజీలో పనిచేసే సిబ్బంది తమ జీతాలు పెంచమని  వసుధరని అడుగుతారు. దానికి వసుధర కాస్త టైమ్ కావాలని చెబుతుంది. జీతాలు పెంచడం పై నిర్ణయం తీసుకున్న తరువాతే పనిచేస్తామని చెప్పి, వెళ్లిపోతారు.

Ads

వసుధర ఈ విషయాన్ని రిషికి చెబుతుంది. అప్పుడు రిషి కాలేజీకి వచ్చి, విద్యార్ధులతో మాట్లాడి, సమస్యను చెబుతాడు. న్యూ స్టాఫ్‌ని తీసుకువస్తానని, ఇక నుండి లెక్చరర్‌గా క్లాసులు తీసుకుంటానని చెప్తాడు.రిషి మాటలకు స్టూడెంట్స్ అంగీకరిస్తారు. ఆ తరువాత ఫణీంద్ర, శైలేంద్ర, దేవయాని మహేంద్ర ఫ్యామిలిని ఇంటికి రమ్మని చెప్పడానికి వెళ్తారు. దానికి రిషి, మహేంద్ర ఒప్పుకోరు. తాము కొద్దిరోజుల పాటు ఎటైనా దూరంగా వెళ్లాలనుకుంటున్నట్లు రిషి వారికి చెప్తాడు.
రిషి, తండ్రి, భార్యను తీసుకుని హాలీ డే ట్రిప్‌కి వెళ్తారు. వాళ్లు అక్కడ సంతోషంగా ఉన్న సమయంలో, మహేంద్ర ఒక చెట్టు క్రింద కూర్చుని తాగుతూ ఉంటే, హఠాత్తుగా మహేంద్ర అనే పిలుపు వినిపిస్తుంది. అప్పుడు మహేంద్ర షాక్ అవుతాడు. ఆమెను వెనక నుండి చూస్తే జగతి లానే అనిపిస్తుంది. ఆమె ఎవరు అనేది తరువాతి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Also Read: “హాయ్ నాన్న” ఆ తెలుగు సినిమా రీమేకా.? టీజర్ చూస్తే… ఆ “నాగార్జున” సినిమా స్టోరీ లాగా అనిపిస్తుందిగా.? 

Previous articleతెలుగులో ముగ్గురు అక్క చెల్లెళ్ళతో నటించిన ఒకే ఒక స్టార్ హీరో ఎవరో తెలుసా ?
Next articleవరల్డ్ కప్ లో టీం ఇండియాకి చీర్ చేస్తున్న ఈ “మిస్టరీ గర్ల్” ఎవరో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.