Ads
ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త కథలకి బాగా డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఓటీటీలలో రిలీజ్ అవుతున్న సినిమాల కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
Ads
ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి చిత్రాలతో చిరకాలం గుర్తుండిపోయే పాత్రలలో నటించి, మెప్పించిన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణారామా’. దసరా కానుకగా ఓటిటి ఈటీవి విన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు తన సినిమాలతో నవ్వించి, స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కొన్నేళ్ళ నుండి సీరియస్, ఎమోషనల్ పాత్రలలో నటిస్తూ, ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన కృష్ణారామా మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన భార్యగా సీనియర్ హీరోయిన్ గౌతమి నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, అనన్య శర్మ, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రామతీర్థ(రాజేంద్ర ప్రసాద్), కృష్ణవేణి(గౌతమి) ఇద్దరు భార్యభర్తలు సంతోషంగా జీవిస్తుంటారు. వీరు ఇద్దరు ఉపాధ్యాయులు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు, వారంతా విదేశాల్లో స్థిరపడతారు. వారిని చూసీ, మాట్లాడడానికి రామతీర్థ, కృష్ణవేణిలకు నెలలో ఒక్కరోజు మాత్రమే వీలవుతుంది. మిగతా రోజులు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా రోజు వారి పిల్లలని చూసి, మాట్లాడాలనే కోరికతో ప్రీతీ(అనన్య శర్మ) సాయంతో ఫేస్ బుక్ లో #కృష్ణారామా అనే పేరుతో అకౌంట్ ను తెరుస్తారు.
కృష్ణారామా ద్వారా వారిద్దరి అభిప్రాయాలను పంచుకుంటారు. అలా ఇద్దరు బాగా పాపులర్ అవుతారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోయే స్థితి వస్తుంది. దాంతో ఆ-త్మ-హ-త్యకు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అసలు వాళ్ళిద్దరూ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పిల్లల విషయంలో వారి కోరిక నెరవేరిందా లేదా? ప్రీతీ ఎవరు? ఆమెకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ.
పిల్లలని చదివించి, వారి ఉన్నతి కోసం విదేశాలకు పంపించేసి, వారు అక్కడే సెటిల్ అయితే, ఆ పిల్లలకు దూరంగా ఉండే తల్లిదండ్రులకు ఎలాంటి బాధ ఉంటుందో చెప్పే కథ. రామతీర్థగా రాజేంద్రప్రసాద్ జీవించారు. కృష్ణవేణిగా గౌతమి ఆకట్టుకుంది. అమ్మానాన్నలని గుర్తుచేసే ఈ మూవీ వృద్దులనే కాకుండా పిల్లలని కూడా ఆలోచింపజేస్తుంది.
Also Read: ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?