ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

తెలుగు సినిమాలలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లు నటించి, అలరించారు. వారిలో చాలా మంది హీరోయిన్లు తమదైన నటనతో ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్స్ గా రాణించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

తమ అభిమాన తారల విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఉంటారు. అభిమాన తారల పుట్టినరోజు లేదా మరేదైనా సందర్భంగా వారి పాత ఫోటోలను లేదా చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫోటోలో అందమైన కళ్ళతో ఉన్న అమ్మాయి. తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఆమె ఎవరో వెంటనే గుర్తుపడతారు. ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే గ్లామర్ అని భావిస్తారు. కానీ ఆమె గ్లామర్ కు దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆమె మరెవరో కాదు హీరోయిన్ స్నేహ.
జూనియర్‌ సౌందర్యగా పేరు తెచ్చుకున్న స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు.1981లో అక్టోబర్ 12న ముంబైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన స్నేహ, దుబాయ్‌లో పెరిగారు. హీరోయిన్ గా స్నేహ నటించిన తొలి మూవీ ‘విరుంబుగిరెన్’ 2000 మొదలయింది. కానీ చాలా ఆలస్యం అవడంతో మాధవన్ తో నటించిన ‘ఎన్నవలే’ మూవీ మొదటి తమిళ మూవీగా రిలీజ్ అయింది. ఈ మూవీలో స్నేహ  నటనకు ప్రశంసలు అందుకుంది. 2001 లో ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.
అలా ఆమె తెలుగులో స్టార్ హీరోలు అయిన వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, జగపతిబాబు, శ్రీకాంత్, తరుణ్ లతో నటించింది. తమిళం, మలయాళ, కన్నడ సినిమాలలో కూడా నటించి, మెప్పించింది. తమిళ నటుడు ప్రసన్నతో కొన్నేళ్ళు ప్రేమలో ఉన్న స్నేహ, 2012లో మే 11న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్నేహ, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పలు బుల్లితెర షోల్లో కూడా కనిపిస్తున్నారు.

Ads

Also Read: 1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!

 

 

Previous articleదేశంలో 2 హైదరాబాద్ లు ఉన్నాయని తెలుసా..? ప్రపంచంలో 84 హైదరాబాద్ లు ఉన్నాయట..?
Next articleకోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.