ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఇలా భిక్షాటన చేస్తూ..? సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో..?

Ads

సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం చాలా కష్టమైన విషయం. ఇక్కడ అనామకులు  రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా స్టార్ స్టేటస్ ఉన్నవారు రాత్రికి రాత్రే రోడ్డు మీద పడిన ఘటనలు ఉన్నాయి.

అలాంటి గొప్ప నటీనటులు విషాద కథలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రాణించిన నటి, అవకాశాలు లేక బిక్షాటన చేస్తూ అరెస్ట్ అవడంతో వార్తల్లో నిలిచారు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని చాలా మంది కలలు కంటారు. వాటిని నిజం చేసుకోవడం కోసం ముంబైకి వెళ్తుంటారు. అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే, వాటితో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. వెళ్ళిన వారిలో కొందరు మాత్రమే నటులుగా సక్సెస్ అవుతారు. కొందరు ఎంత ప్రయత్నించినా  అవకాశాలు రాక వెనుతిరిగుతారు. అయితే కొందరు తిరిగి వెళ్లలేక, అవకాశాలు లేక దారుణమైన జీవితాన్ని గడుపుతారు. అలాంటిదే ఒకప్పటి హీరోయిన్ మిథాలీ శర్మ జీవితం.
మిథాలి శర్మ స్వస్థలం ఢిల్లీ. టీవీలో కనిపించాలనే కోరికతో ఇంటి నుంచి ముంబైకి పారిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటకు రాగానే కుటుంబం మిథాలితో సంబంధాలు తెంచేసుకుంది. ఒంటరిగా ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఆమె ముందుగా మోడలింగ్‌ చేసింది. ఆ తరువాత సినిమాలలో ఛాన్స్ రావడంతో నటించడం మొదలుపెట్టింది. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్లు, నిర్మాతలు మిథాలితో సినిమాలు చేయడానికి పోటీపడ్డారు. ఆ స్థాయిలో ఆమె క్రేజ్‌ ఉండేది ఆ రోజుల్లో. భోజ్‌పురిలో స్టార్ హీరోయిన్‌ గా మారారు.
అయితే ఒక్కసారిగా ఆమెకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆమె నటించిన చిత్రాలన్ని ఫ్లాప్‌ కావడంతో  అవకాశాలు తగ్గాయి. నెలలు గడిచినా ఛాన్స్ దొరక్కపోవడంతో మిథాలి డిప్రెషన్‌లోకి వెళ్ళింది. కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న మిథాలి ముంబై వీధుల్లో భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితం ముంబైలో భిక్షాటన చేసేవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో  మిథాలి శర్మ కూడా ఉన్నారు.
అరెస్ట్ చేసిన మహిళా పోలీసును మిథాలి తిట్టిందని, పారిపోవడానికి ప్రయత్నించిందని న్యూస్ వినిపించాయి. మిథాలిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లగా ఆమె కొంచెం అన్నం పెట్టమని ప్రాధేయపడిందట. ఆమెకు పోలీసులు అన్నం పెట్టారని, ఆమె మానసిక స్థితి బాలేదని, మానసిక వికలాంగుల ఆశ్రమంలో మిథాలిని చేర్పించినట్లుగా వార్తలు కూడా వచ్చాయి.

Ads

Also Read: ఇదెక్కడి క్రియేటివిటీ బాబు.. ప్రమోషన్స్ తోనే కామెడీ పండించేస్తున్నారుగా..?

 

Previous articleసాంగ్ సూపర్ అంటూ.. జైలులో చంద్రబాబు ఏఐ వీడియోని పోస్ట్ చేసిన అనితారెడ్డి..!
Next articleఇంట్లో ఒప్పుకోకపోయినాసరే పెళ్లి చేసుకున్నారు.. కంటతడి పెట్టిస్తున్న యువతి గాధ.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.