ఇదెక్కడి క్రియేటివిటీ బాబు.. ప్రమోషన్స్ తోనే కామెడీ పండించేస్తున్నారుగా..?

Ads

దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగా చాలా కాలం విరామం తరువాత మూడవ సినిమాకు దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే తరుణ్ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్రహ్మానందం లీడ్ రోల్ లో నటిస్తున్న కీడా కోలా మూవీలో చైతన్య రావు, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, రఘు రామ్, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. పెళ్లి చూపులు మూవీతో నేషనల్ అవార్డ్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది మూవీ తరువాత యాక్టర్ గా మారారు. పలు చిత్రాలలో నటించి, తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.
తరుణ్ భాస్కర్ ఐదేళ్ల గ్యాప్ తరువాత కీడా కోలా మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇంటర్వ్యూల్లో తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ నవ్విస్తూ, మూవీ పై మరింత ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పోస్టర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ చేస్తున్నాడు.
పాత పద్దతినే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు తరుణ్ భాస్కర్. కీడా కోలా పోస్టర్స్ ని, మీమ్ పోస్టర్ వలె  రూపొందించాడు. బ్రహ్మానందం ఫోటో పక్కన “నన్ను కాదు రోడ్డు చూసి నడుపు” అని వాహనదారులకు జాగ్రత్త చెబుతూనే మూవీ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ పోస్టర్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: “రజినీకాంత్ లాంటి హీరో టీ అమ్మడం ఏంటి..?” అన్నారు..! అసలు విషయం ఏంటంటే..?

Previous articleనేషనల్ అవార్డ్ విన్నర్ ని అంతమాట అనేసారు ఏంటి ఈ బిగ్ బాస్ బ్యూటీ..?
Next articleసాంగ్ సూపర్ అంటూ.. జైలులో చంద్రబాబు ఏఐ వీడియోని పోస్ట్ చేసిన అనితారెడ్డి..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.