”రామ రామ” అని చూడకూడనిది చూసినప్పుడు కానీ అనకూడనిది అన్నప్పుడు కానీ ఎందుకు అంటారు..?

Ads

ఏదైనా చూడకూడనిది చూసినప్పుడు కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ చాలా మంది రామ రామ అని కానీ శివ శివా అని కానీ అంటూ ఉంటారు. మీరు కూడా ఇలా చాలా సార్లు అనే ఉంటారు. అయితే ఎందుకు ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ ఏదైనా చూడకూడనిది చూసినప్పుడు ఎందుకు శివ శివ కానీ రామ రామ అని కానీ అంటారు..? ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

శివమహా పురాణం రుద్రసంహిత ఇరవై నాలుగో అధ్యాయంలో దీని సందర్భం వుంది. శ్రీ రామ చంద్రుడు అరణ్యవాసం చేసినప్పుడు సీతాపహరణ జరుగుతుంది.

రాముడు, లక్ష్మణుడు ఆమెని వెతుకుతూ వుంటారు. అడవుల్లో ప్రతీ చోటా కూడా సీతా దేవి కోసం చూస్తారు. ఆ సమయంలో రాముడికి మిక్కిలి దుఃఖం కలుగుతుంది. ఆ సమయంలో లోక సంచారం చేస్తూ ఉండగా.. ఆకాశ మార్గాన వెళ్తున్న పార్వతి పరమేశ్వరులు రామ లక్ష్మణులని చూస్తారు. రాముడు తన సీత కోసం బాధపడే తీరు సతీదేవికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతలా భార్య కోసం భర్త బాధ పడతాడా..? భార్యను ఇంతగా ప్రేమిస్తారా పురుషులు అని ఆమెకి సందేహం వస్తుంది. ఇక శివుడిని ఈ విషయం కోసం సతీదేవి అడుగుతుంది. భార్యను ప్రేమించడంలో కానీ ఆరాదించడంలో కానీ ఆయనని మించిన వారే లేరని అంటాడు. కానీ సతీదేవి నమ్మదు.

Ads

ఆయన పడే బాధ కూడా నటనే అని పార్వతి దేవి భావించింది. నమ్మకం లేదని స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించాలని శివుడుతో పార్వతి అంటుంది. దానికి శివుడు నవ్వి ఎన్ని పరీక్షలు పెట్టినా రాముడే గెలుస్తాడని చెబుతాడు. రాముడిని పరీక్షించమని చెప్పేసి శివుడు మర్రిచెట్టు కిందకు వెళ్తాడు. రామలక్ష్మణులు ఎదుట సతీ దేవి సీతలా నిలబడుతుంది. సతి దేవిని చూసి సీతే అనుకుంటాడని ఆమె భావిస్తుంది. కానీ రాముడు శివ శివా అంటూ శివనామస్మరణం చేస్తూ తప్పుకుంటాడు. ఇలా పురాణకాలం నుండే ఏదైనా చూడకూడనిది చూసినప్పుడు కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు శివ శివా అని అనేవారు.

 

 

Previous articleస్విచ్ బోర్డ్ సాకెట్ లో మూడో పెద్ద కన్నం ఎందుకు ఉందో మీకు తెలుసా..?
Next articleత‌ల్లి గర్భంలో ఉన్న శిశువు ఎందుకు తన్నుతుందో తెలుసా?