వెస్ట్రన్ టాయిలెట్స్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఎందుకు ఉంటాయి.? ఏది ఎప్పుడు వాడాలి.?

Ads

ప్రస్తుతం ఇళ్లలో, మాల్స్, ఆఫీసులలో, సినిమా హాళ్లలో ఎక్కువగా వెస్ట్రన్ టాయిలెట్లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వెస్ట్రన్ టాయిలెట్లలో కొన్ని ఫ్లష్‌లకు 2 బటన్లు కనిపిస్తాయి. వాటిని  గమనించినట్లయితే ఆ బటన్లలో ఒకటి చిన్నగా, ఇంకొకటి పెద్దగా ఉంటుంది.

చాలామంది వీటిని ఉపయోగిస్తారు. కానీ ఆ బటన్లు ఇలా ఎందుకు ఉన్నాయనే విషయం అందరికీ  తెలియకపోవచ్చు. వాటిని ఏమని అంటారో? ఈ బటన్లు ఎందుకు ఉంటాయి? వీటిని ఎప్పుడు వాడాలో ఇప్పుడు చూద్దాం..
గత కొన్నేళ్లుగా వెస్ట్రన్ టాయిలెట్ల వినియోగం చాలా పెరిగింది. ఇళ్ళలో కూడా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. కొందరు బాగా అలవాటై, కొందరు కింద కూర్చోలేక, మోడ్రెన్ గా ఉండాలని మరికొందరు  వెస్ట్రన్ టాయిలెట్లను తమ ఇళ్లల్లో అమర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక బయట మాల్స్, ఆఫీసులలో, సినిమా హాళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లే కనిపిస్తున్నాయి.
అయితే కొన్ని వెస్ట్రన్ టాయిలెట్లలో 2 ఫ్లష్ బటన్లు వస్తున్నాయి. వీటిలో ఒకటి పెద్దగా ఉంటే మరొకటి చిన్నగా ఉంటుంది. ఇలా ఉండే బటన్స్ ను డ్యూయల్ ఫ్లష్ అని అంటారు. ఈ బటన్లు రెండు ఎగ్జిట్ వాల్వ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటాయి. కానీ వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది. ఈ బటన్లు రెండు డిఫరెంట్ ఎత్తులలో ఓపెన్ అయ్యి, వాటర్ ను బయటకు పంపిస్తాయి.
డ్యూయల్ ఫ్లష్ లో ఉండే చిన్న బటన్ ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అది తక్కువ వాటర్ ను బయటకు పంపిస్తుంది. ఇక పెద్ద బటన్ ఎక్కువ వాటర్ ను బయటకు పంపిస్తుంది. ఇంకా చెప్పాలంటే డ్యూయల్ ఫ్లష్ లో ఉండే పెద్ద బటన్ నొక్కితే ఆరు నుండి తొమ్మిది లీటర్ల వాటర్ టాయిలెట్‌లోకి వెళ్తాయి. చిన్న బటన్ నొక్కితే 3- 4.5 లీటర్ల వాటర్ విడుదలవుతాయి. అంటే ఘన వ్యర్ధాల ఫ్లష్ కోసం పెద్ద బటన్, ద్రవ వ్యర్ధాలను ఫ్లష్ చేయడానికి చిన్న బటన్ ను అమర్చారు.

Ads

Also Read: అంబులెన్సు కి “108” నెంబర్ ఎందుకు పెట్టారు..? సైన్స్ ఏం చెబుతోంది..? హిందూ ధర్మం ఏం చెబుతోంది..?

Previous articleరేపే చంద్రగ్రహణం.. ఈ 4 రాశుల వారు కష్టాలు ఎదుర్కొనే ప్రభావం..!
Next articleపాకిస్థాన్ పై మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు వెనకున్న ఈ భారతీయుడు ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.