Ads
పన్నీర్ ను వెజ్ లో రారాజు. పన్నీర్ ను ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు. వెజిటేరియన్స్ హోటల్ లేదా రెస్టారెంట్ కి వెళ్ళినపుడు ఆర్డర్ చేసేది ఎక్కువగా పన్నీర్ వంటకాలే. పన్నీర్ తో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు.
పన్నీర్ ను కొందరు ఇంట్లో కూడా తయారు చేస్తుంటారు. తాజాగా పన్నీర్ ఇష్టపడేవారిని కలవర పెట్టే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పన్నీర్ లవర్స్ ని ఆలోచింపచేసే ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలో పన్నీర్ ను తయారు చేసే క్రమంలో ఒక వ్యక్తి పన్నీర్ పై కూర్చున్నాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు సంబంధించిన ఫోటో అని తెలుస్తోంది. అజర్ జాఫ్రి అనే యూజర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పన్నీర్ పై లుంగీ కట్టుకుని కూర్చున్న వ్యక్తి ఫోటోను పోస్ట్ చేశాడు.
Ads
ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ “ఇది చూసిన తర్వాత నాన్ బ్రాండెడ్ పన్నీర్ ను ఎప్పుడూ కొనకండి” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పన్నీర్ పరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేయబడిందా అని ఆలోచించండి. ప్రసిద్ధ బ్రాండ్లు అదే పద్ధతులను అనుసరిస్తున్నాయా అనే సందేహాలు వస్తున్నాయని కామెంట్ చేశారు. ఈ పోస్ట్ ను చూసిన కొందరు నాన్-బ్రాండెడ్ పనీర్‌ను కొనవద్దని కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
ఈ ఫొటో అక్టోబర్ 28 రాత్రి 9 గంటల సమయంలో ఎక్స్ లో పోస్ట్ అయ్యింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు ఇప్పటివరకు 60 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్ పై కొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి పన్నీర్ పై కూర్చోలేదని, పన్నీర్ పై ఉన్న మూత పై కూర్చున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఈరోజుల్లో కూడా ఇలాంటి హోటల్ ఉందా..? విజయవాడలో వాళ్ళకి తెలిసే ఉంటది..!