Ads
ఈ రోజుల్లో ఎప్పుడైనా సరదాగా బయట టిఫిన్ చేయాలి అంటే మనిషికి 50 రూపాయల పైనే ఖర్చవుతుంది. అది కూడా ఒక మోస్తారు హోటల్ లాంటి దగ్గర చేయాల్సి వస్తే ఇంకా ఎక్కువే అవుతుంది. అంత ఖర్చు పెట్టి తినలేని వాళ్ళు, అలాగే ఇంటిలో చేసుకునే వసతి లేని వాళ్ళు చాలా సందర్భాల్లో ఆ 50 రూపాయలు కూడా మిగులుతాయిలే అని ఒక పూట తినడం మానేస్తూ ఉంటారు.
అదిగో అలాంటి వారి కోసమే విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న హోటల్ తణ్మయి ఎదురుగా ఆర్యవైశ్య టిఫిన్ హోటల్ వారు…చాలా తక్కువ ధరలకే మంచి రుచికరమైన ..సుచికరమైన టిఫిన్స్ అమ్ముతున్నారు. విజయవాడలో ఆటోనగర్ ఎందరో కార్మికులకు నిలయం. రోజు ఎంతోమంది కార్మికులు ,లారీ డ్రైవర్లు , మెకానిక్స్.. ఇలా చాలామంది ఆటోనగర్ కు పనిమీద వస్తూ ఉంటారు. ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ హోటల్లో కేవలం ఇడ్లీ ,గారే , పునుగులు,బజ్జి వంటివి 10 రూపాయలకే విక్రయించడం జరుగుతుంది.
Ads
తక్కువ ధరకు ఇస్తున్నారు కదా క్వాలిటీ ఉండదు అనుకుంటున్నారా…కాదండోయ్ ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ, టమాటో చట్నీ వేసి మరి సృష్టిగా పెట్టి పంపిస్తారు. ఈ హోటల్ గురించి తెలుసుకున్న ,విజయవాడ రామవరప్పాడులో లో నివాసం ఉంటున్న అంబేద్కర్ ఇది నిజమా కాదా అన్న డౌట్ తో అక్కడకు వెళ్ళాడు. అయితే నిజంగానే ఆ పది రూపాయల టిఫిన్ చూసి ,కడుపునిండా తిని ,ఇంట్లో వాళ్లకు కూడా పార్సల్ తీసుకెళ్లాడు.
ఇదే టిఫిన్ బయట కొనాలి అంటే సుమారు 500 రూపాయలు అవుతుందని…అలాంటిది ఇక్కడ ఇద్దరు తిని నలుగురికి పార్సల్ తీసుకువెళ్లిన మొత్తం కలిపి 200 రూపాయలు అయిందని అంబేద్కర్ అన్నారు. ఈ రోజుల్లో కూడా వేరే వారి కోసం ఇంత చేసే మనుషులు ఉండడం నిజంగా గొప్ప అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
watch video: