Ads
ఈసారి ప్రపంచ కప్ భారత్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంతగడ్డ పై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ఆటతో ఇప్పటివరకు జరిగిన మ్యాచులలో వరుస విజయాలను సాధించింది. టీంఇండియా ఆటతీరుకి అభిమానులు సంతోష పడుతున్నారు.
ఇప్పటివరకు ప్రపంచ కప్ లో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ లలో గెలుపు సాధించింది. దీంతో అనధికారికంగా భారత్ సెమీస్ లో బెర్త్ ను సంపాదించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ గెలుపు సాధించింది. అయితే ఆ మ్యాచ్ తరువాత టీమిండియా డ్రెస్సింగ్ రూంలో జరిగిన సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు డ్రెస్సింగ్ రూం కల్చర్ లో గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చినట్టుగా తెలుస్తోంది. టీమిండియా ఒక మ్యాచ్ లో విజయం సాధించిన తరువాత, ఆ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్లేయర్స్ ను, మ్యాచ్ లో మంచి క్యాచ్ పట్టుకున్న ప్లేయర్స్ ని మేనేజ్ మెంట్ సత్కరిస్తున్నారు.
మ్యాచ్ పూర్తయిన తరువాత ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ అందరూ డ్రెస్సింగ్ రూంలో సమావేశం అవుతారు. అక్కడ కోచింగ్ స్టాఫ్ లో ఒకరు ఆ రోజు జరిగిన మ్యాచ్ లో ఏ ప్లేయర్స్ బాగా ఆడారో, ఎందులో వారు తమ టాలెంట్ చూపించారనే విషయాన్ని వివరిస్తారు.
అది మాత్రమే కాకుండా బౌలర్లు రాత్రి సమయంలో మంచులో బౌలింగ్ చేసేటపుడు ఇబ్బంది పడకుండా, బంతిని ఫీల్డర్లు పొడిగా ఉంచడానికి చేసే ట్రయల్స్ ను కోచింగ్ స్టాఫ్ గమనిస్తుంటుంది. ఈ విషయాలను తాము గమనిస్తుంటామనే విషయాన్ని డ్రెస్సింగ్ రూంలో చెప్పడం ద్వారా ప్లేయర్స్ లో స్ఫూర్తిని పెంచేందుకు కోచింగ్ స్టాఫ్ ప్రయత్నిస్తుంది.
మంచి ఫీల్డింగ్ ను ప్రదర్శించి, అద్భుతమైన క్యాచ్ పట్టిన ప్లేయర్ కు మెడల్ బహూకరిస్తారు. ఆదివారం నాడు ఇంగ్లండ్ తో ఆడిన మ్యాచ్ లో గెలిచిన తరువాత భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో ఉత్సాహకరమైన వాతావరణం కనిపించింది. ఇక కేఎల్ రాహుల్ కు మెడల్ వస్తే, ఇతర ఆటగాళ్లు వారందరికీ వచ్చినట్టుగా సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఈ వీడియోని షేర్ చేసింది.
Ads
Also Read: హార్దిక్ పాండ్య స్థానంలో టీం లోకి ఆ ఆల్ రౌండర్ ని తీసుకురానున్న రోహిత్…పెద్ద ప్లాన్ వేసాడుగా.?