ఒకప్పుడు “బాలయ్య” సినిమా 40 కోట్లు అంటే గొప్ప…కానీ ఇప్పుడు సడన్ గా మార్కెట్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా.?

Ads

ఆరుపదుల వయసు దాటుతున్న బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అఖండకు ముందు అఖండ తర్వాత బాలకృష్ణ కెరియర్ లో.. మూవీ కలెక్షన్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు 30 -40 కోట్ల మధ్యలో ఉండే బాలయ్య మార్కెట్ ఇప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాకి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే సడన్ గా బాలయ్య కలెక్షన్ గ్రాఫ్ అలా ఎలా పెరిగింది అర్థం కాక ప్రస్తుతం కుర్ర హీరోలు కూడా తలలు పట్టుకొని కూర్చుంటున్నారు.

ఒకప్పుడు బాలయ్య సినిమాలో మాక్సిమం మార్కెట్ విలువ 40 కోట్లు దాటితే ఎక్కువ అనే పరిస్థితి ఉండేది. అలాంటిది సడన్ గా డబల్ త్రిబుల్ ఎలా అయింది? బాలయ్య సినిమా అంటే కేవలం మాస్ ప్రేక్షకులు మాత్రమే చూస్తారు అన్న భ్రమ నుంచి కుటుంబ సమేతంగా థియేటర్లకు కదలి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా యూత్ లో బాలయ్య సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ మొదలైంది అఖండ సినిమా తర్వాత అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

Ads

రీసెంట్ గా విడుదలైన భగవంత్ కేసరి 100 కోట్ల క్రాస్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. బాలయ్య క్రేజ విపరీతంగా పెరగడానికి “అన్ స్టాటబుల్” షో ఒక ముఖ్య కారణం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ షో రావడానికి ముందు బాలకృష్ణ ఎంతో కోపదారి మనిషి.. అన్న ఇమేజ్ ఉండేది. ఆయన గురించి బయటకు వచ్చే వీడియోస్ కూడా ఎక్కువగా అభిమానులను కొట్టడం, చుట్టూ ఉన్న వాళ్ళని కోప్పడడం లాంటివే ఉండేవి.

దీంతో అతనిపై ఎక్కువగా నెగటివ్ అభిప్రాయం వచ్చింది. అయితే ఆన్ స్టేజ్ షో లో బాలకృష్ణ నిజంగా ఏంటి అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.ఈ ఒక టాక్ షో తో బాలయ్య పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా అంతకంత పెరిగింది. అందుకే అన్ స్టాపబుల్ షో సీజన్ 2, సీజన్ 3 అంటూ అన్ స్టాపబుల్ గా సాగిపోతుంది.

Previous articleకారు కొన్న సమయంలో “పెద్ద కీ” తో ఫోటో వెనక ఇంత పెద్ద బిజినెస్ ఉందా.?
Next articleవరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ “డ్రెస్సింగ్ రూమ్”లో ఏం జరుగుతుందో తెలుసా..?