Ads
ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు కీలక పోరుకు సిద్ధం అవుతోంది. నేడు వాంఖడే వేదికగా జరగబోయే మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. భారత్ ఈ మ్యాచులో విజయం సాధిస్తే సెమీస్ బెర్తు ఖాయం అవుతుంది.
ఈ మ్యాచ్ కోసం అందరూ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. శ్రీలంక ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ను పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది.
మెగాటోర్నీలో భాగంగా ఆరో మ్యాచ్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తరువాత భారత కీలక ప్లేయర్ కష్టాలలో పడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై గెలుపు సాధించింది. ఇంగ్లాండ్ 129 రన్స్ కె కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తరువాత టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ చిక్కుల్లో పడ్డాడు. దాంతో అతని పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచకప్ టోర్నీలో అయ్యర్ ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. ఇంగ్లండ్ జట్టు పై అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో అయ్యర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 16 బంతులు మాత్రమే ఆడాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 134 పరుగులు చేశాడు. అయితే అతను అవుట్ అయిన తీరు జట్టుని ఆందోళనకు గురిచేసిదనని తెలుస్తోంది. ఇంగ్లండ్ పై అయ్యర్ షార్ట్ బాల్‌లో అవుట్ అయ్యాడు. అయ్యర్ ఎదుర్కొంటున్న సమస్య షార్ట్ బాల్.
ఈ టోర్నీలో కూడా అదే కనిపించింది. న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో అయ్యర్ షార్ట్ బాల్‌లోనే అవుట్ అయ్యాడు. ప్రతిసారి షార్ట్ బాల్ కి బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే ప్రత్యర్థులు ఆ ఛాన్స్ ని ఉపయోగించుకుంటారు. దీంతో అయ్యర్‌ను పక్కనపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అతని స్థానంలో ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహ్మద్ సిరాజ్ ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్ తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Ads
Also Read: ముంబై వీధుల్లో ముసుగు వీరుడు.. ఈ టీమిండియా క్రికెటర్ ని గుర్తుపట్టారా..?