Ads
ప్రపంచ కప్ లో భారత పాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వీర విహారం చేస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో 14 వికెట్లతో రఫ్ఫాడించాడు. కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో బాధలు పడ్డ షమీ ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ గా మారాడు.ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు బాధలు తప్పవు. జీవితం మీద ఆసక్తి ఉండదు.ఏం చేసినా ఏం చేద్దామనుకున్నా అడ్డంకులు ఎదురవుతాయి.
ఈ కష్టాలను బాధలను తట్టుకోలేక ఆత్మహత్య బెస్ట్ అని చాలామంది అనుకుంటారు కానీ అది చాలా తప్పు మనిషికి కష్టాలు బాధలు అనేవి సర్వసాధారణం. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం మనమే తెప్పించుకోవాలి. కష్టాలను మనమే దాటుకు పోవాలి.బాధలను అధిగమించాలి. కన్నీరుతో పోరాడిన వాడే హీరో అవుతాడు. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ జీవితమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో షమీ పేరు మారు మోగిపోతుంది.
వరల్డ్ కప్ టీంలో షమీ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నా గాని తుది జట్టులోకి రావడానికి నాలుగు మార్కులు వేసి చూడాల్సి వచ్చింది. పాండ్యాకు గాయం అయితే గాని షమీని జట్టు లోకి తీసుకోలేదు. వచ్చి రావడంతోనే న్యూజిలాండ్ పై ఆధార కొట్టి ఏకంగా ఐదు వికెట్లతో మెరిసాడు. తర్వాత ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్లు, తాజాగా శ్రీలంకపై ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. మొత్తంగా ఈ వరల్డ్ కప్ లో 14 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో ఐదో వికెట్ తీసిన తర్వాత దేవుడిని తలుచుకుంటూ గ్రౌండ్ పై రెండు చేతులతో వాలిపోయిన షమీనీ చూస్తే ఈ స్థితికి రావడానికి అతను ఎంత కష్టపడ్డాడు అనేది కనిపిస్తుంది.
Ads
షమీని చూసిన వారి అందరికీ తన గతం గుర్తు వచ్చింది. చాలామంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.గతంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న షమీ తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. భార్య విషయంలో చేయకూడని తప్పులేవో చేశాడు. కోర్టులోను ఎదురు దెబ్బలు తిన్నాడు. కుటుంబమంతా ఒక వైపు షమీ ఒక్కడే ఇంకొక వైపు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ షమీ కాంట్రాక్టు కూడా ఆపేసింది.
షమీ భార్య అతనిపై చేసిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని నిర్ధారించుకున్న తర్వాతే మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టేలా చేసింది. అంతకుముందు ఫామ్ లేక దాదాపు ఏడాదినర కాలం షమీ జట్టుకు దూరమయ్యాడు. ఆల వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎన్నో బాధలు పడ్డ షమి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని తానే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ రోజులు లేవు. ప్రపంచ కప్పులో షమీ రారాజు. షమీని పక్కన పెట్టే సాహసం టీమిండియా చెయ్యదు. భారత క్రికెట్ అభిమానులు షమీ లేని టీం ని ఊహించుకోలేరు. దట్ ఇస్ షమీ.
Also Read:సౌత్ ఆఫ్రికాతో ఈరోజు మ్యాచ్ లో ఇలా జరిగితే… ఈసారి వరల్డ్ కప్ ఇండియాదే …ఎందుకంటే…?