Ads
గుంటూరు నుండి వెళ్లిన డాక్టర్లు ఇతర దేశాలలో ప్రఖ్యాతి సాధించారు. స్వాతంత్ర్యానికి ముందు నుండే గుంటూరు స్టూడెంట్స్ విదేశాలకు వెళ్లి అక్కడ కూడా తమ సేవలు అందిస్తున్నారు.
అయితే కొందరు విదేశాల్లో చదవుకొని ప్రస్తుతం గుంటూరులో సేవలు అందిస్తూనే, వరల్డ్ వైడ్ గా ఉన్న పేషంట్స్ కు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలాంటి హాస్పటల్స్ లో రావూస్ హాస్పటల్ ఒకటి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఇక్కడ వైద్యం చేయించుకోవడం కోసం విదేశీయులు సైతం వస్తున్నారు. అక్టోబర్ లో యూకే, నెదర్లాండ్స్ కు చెందిన పేషంట్స్ ఆన్ లైన్ రావూస్ హస్పటల్ డాక్టర్ మోహన్ రావు ను సంప్రదించి ట్యూమర్స్ తొలగించుకోవడం కోసం గుంటూరుకు వచ్చారు. మోహన్ రావు వారిద్దరికీ సర్జరీ చేసి కొలుకునే విధంగా చేశారు. నార్మల్ వైద్యంతో పాటు కష్టతరమైన సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు అన్ని ఈ హాస్పటల్ లో అందుబాటులో ఉండడంతో విదేశీయులు ఇక్కడ సర్జరీలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మోహన్ రావు హైదరాబాద్ నిమ్స్ లో పిజీ చేసి, సూపర్ స్పెషాలిటీ కోర్సులను విదేశాల్లో చేశారు. గుంటూరు పై ఉన్న ఇష్టంతో ఆయన ఇక్కడే ఉంటూ తక్కువ ఖర్చుకే అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు. న్యూరో మరియు స్పైన్ సర్జన్ గా మోహన్ రావు అందిస్తున్న సేవలకు గాను, నేషనల్ వైడ్ గా ఉత్తమ న్యూరో, స్పైన్ సర్జన్ అవార్డు అందుకున్నారు.
ఈ ఏడాదికి గాను గ్లోబల్ బ్రాండ్ ఆప్ అవార్డును మోహన్ రావు అందుకున్నారు. గుంటూరు లాంటి నగరంలో ఉంటూ తక్కువ ఖర్చుకే మంచి వైద్య సేవలు చేస్తున్న డాక్టర్ మోహన్ రావును పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ను పేదలకు అతి తక్కువ ఖర్చుకు అందించాలన్నదే తన ధ్యేయం అని మోహన్ రావు వెల్లడించారు. గ్లోబల్ బ్రాండ్ ఆప్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
Ads
Also Read: అదృష్టం అంటే ఇదే అనుకుంటా…తలపైనే చావును పెట్టుకుని 11 కిలోమీటర్లు బండిని నడిపాడు..చివరకి.?