Ads
మహేష్ బాబు వెంకటేష్ పేకాట ఆడుతున్న ఒక ఫోటో నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై చాలామంది విమర్శించారు కూడా.. అయితే అసలు ఆ ఫోటో వెనుక స్టోరీ ఏంటి అన్న విషయం ఈరోజు బయటపడింది. మహేష్ బాబు ,వెంకటేష్ ఇద్దరు ఫ్యామిలీ స్టార్స్ అని ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉంది.. కెరియర్ ,ఇల్లు తప్ప మూడో ప్రపంచం లేనట్టు బతికే ఇద్దరు పేకాడుతూ ఉన్నారేంటి అని నిన్న అందరూ ఆశ్చర్యపోయారు. ‘జిగర్ తాండా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన వెంకటేష్ తనకు వేరే వర్క్ ఉంది అని చెప్పడం వెంటనే ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదా నాయనా అని అసలు పని అంటూ చాలామంది విమర్శించారు.
Ads
పైగా వెంకటేష్ తో పాటు మహేష్ బాబు కూడా ఉండడంతో ఫోటో మరింత వేగంగా స్ప్రెడ్ అయింది. కానీ విమర్శించే వారు ఎవరు తెర వెనుక అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే మహేష్ బాబు ఒక ప్రముఖ వ్యాపారవేత్త క్లబ్ హౌస్ ఓపెనింగ్ కి వెంకటేష్ తో కలిసి వెళ్లారు. కేవలం వీళ్లిద్దరే కాదండోయ్ ఇంకా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎందరో ఈ ఈవెంట్ కి వచ్చారు.
అక్కడ ఆల్రెడీ ఉన్న టేబుల్ దగ్గర జరుగుతున్న ఆట మధ్యలో కాసేపు వీళ్లిద్దరూ కూర్చొని ఆడారు .అంతే ఎవరో తీసి షేర్ చేసిన ఒక ఫోటో కారణంగా అందరూ వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా, వీళ్లిద్దరు ఆడిన ఆట పేకాట కాదు. పోకర్. ఈవెంట్ కి మహేష్ బాబుతో కలిసి వెళ్లిన అతని భార్య నమ్రత అక్కడ ఫోటోలు షేర్ చేస్తూ వెల్కమ్ టు దీవాలి సీజన్ అన్న క్యాప్షన్ కూడా పెట్టారు. నమ్రత షేర్ చేసిన ఈ ఫొటోస్ లో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. దీంతో ఇది కేవలం సరదా కోసం ఆడిన ఆట అన్న విషయం అందరికీ స్పష్టమైంది.