Ads
గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం చాలా పెరిగింది. సాంకేతిక విప్లవం కారణంగా అన్ని రంగాలలో టెక్నాలజీ ఉపయోగం పెరిగింది. ఈ క్రమంలో టెక్ గాడ్జెట్ల వాడకం చాలా సాధారణం అయ్యింది.
క్రికెట్ లో కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ క్రికెటర్లు టెక్ గాడ్జెట్ల ను వినియోగిస్తున్నారు. భారత జట్టులోని కొందరు ప్లేయర్లు ఒకేలాంటి బ్యాండ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
ఇతర రంగాలతో పోలిస్తే క్రీడా రంగంలో టెక్నాలజీ ఉపయోగం పెరిగింది. ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు ప్లేయర్స్ ఆట, ప్రదర్శన, డైట్ వంటి విషయాల గురించి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనివల్ల ఖచ్చితమైన ఆక్యురేట్తో ఫలితాలు వస్తున్నాయని ఆటగాళ్లు, కోచ్‌లు పలు సందర్భాలలో చెప్పడం తెలిసిందే. సాంకేతికతతో బెటర్ ఫలితాలు వస్తుండటం, పని లోడ్ తగ్గడంతో, ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ టెక్ గాడ్జెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ లు ఒకేలాంటి గాడ్జెట్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఆ బ్రాండే పేరు వూప్. ఈ బ్రాండ్ తయారుచేసిన బ్యాండ్లను ఈ క్రికెటర్లు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాలు ప్రకారం ఆటగాళ్లు స్మార్ట్ వాచ్ వాడడానికి వీల్లేదు. దాంతో కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, సిరాజ్‌లు బ్యాండ్ వాడుతున్నారని క్రికెట్ వర్గాల టాక్. వూప్ బ్రాండ్‌కు సంబంధించిన నలుపు రంగు బ్యాండ్ ను ధరించి భారత ఆటగాళ్లు క్రికెట్ ఆడిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ బ్యాండ్ లో స్ట్రెయిన్, స్లీప్, రికవరీ అనే 3 ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఒక ప్లేయర్ ఎంత ఫిట్నెస్ గా ఉన్నాడు, రికవరీ అయ్యాడా, లేదా? ఎంత సమయం పడుకుంటున్నాడు? వంటివి వీటి ద్వారా తెలుసుకోవచ్చని తెలుస్తోంది. జట్టు మేనేజ్మెంట్లో ఫిజియో, ట్రైనర్స్ వంటివారు ఉన్నప్పటికీ, తమ ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, మరింత మెరుగుపడడానికి ఈ బ్యాండ్‌ను టీమిండియా ప్లేయర్స్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
Ads
Also Read: ఇందుకేగా మిమ్మల్ని తిట్టేది… ఇండియా గెలుపుని ఓర్వలేక ఈ పాక్ ప్లేయర్ ఏమన్నాడు అంటే.?