CA చదివి… ఇలాంటి వ్యాపారం చేయడం ఏంటి అన్నారు..! కానీ కట్ చేస్తే..? అసలు విషయం ఏంటంటే..?

Ads

మనిషి అనుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. జీవితంలో మంచి పొజిషన్ కు వెళ్లాలి అంటే కష్టపడాలి ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కోవాలి. అలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న చాలామంది నేడు కోట్లు సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహిళ కూడా ఒకరు. బెంగళూరుకు చెందిన దివ్య చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని తల్లిదండ్రులు చెప్పడంతో వారి మాట కాదనలేక సీఏ చదవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో కష్టాలను, లెక్కకు మించిన సవాళ్ళను ఎదుర్కొంది.

rameshwaram divya success story

ఖర్చుల కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సిన రోజులు, రోజుకి రెండు మూడు బస్సులు మారాల్సిన పరిస్థితులు అనుభవించింది. కానీ ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా ఎట్టకేలకు అనుకున్న విధంగానే సీఏ పూర్తి చేసింది. అలా తన కుటుంబంలో సిఏ పూర్తి చేసిన మొదటి వ్యక్తి దివ్యానే. అలాగే ఈమె IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ పూర్తి చేసింది.

rameshwaram divya success story

చదువు పూర్తయిన తరువాత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యురాలిగా కొనసాగుతోంది. కాగా ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనే కోరికతో ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని అనుకుంది. చదువుకునే రోజుల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆహార సంస్థలు మంచి లాభాలను తీసుకొస్తాయని గ్రహించి, దక్షిణ భారతదేశ రుచులను అందరికి అందేలా చేయడానికి కంకణం కట్టుకుంది.

Ads

rameshwaram divya success story

ఈ ఆలోచనను తన అమ్మతో చెప్పింది. ఇది విన్న దివ్య తల్లి మేము కస్టపడి సీఏ చదివిస్తే ఇడ్లీ, దోశలు అమ్ముతావా అని చీవాట్లు పెట్టిందట. అలా దివ్య నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారట. అయినా కూడా దివ్య పట్టు వదలకుండా తన భర్త రాఘవేంద్రరావుకి పెళ్లికి ముందు నుంచే ఈ వ్యాపారం మీద కొంత అనుభవం ఉండటం వల్ల 2021లో రామేశ్వరం కెఫే ప్రారంభించింది. ప్రారంభంలో రెండు బ్రాంచీలతో మొదలైన వీరి వ్యాపారం, క్రమంగా వృద్ధి చెందింది.

rameshwaram divya success story

ప్రస్తుతం రామేశ్వరం కెఫే ద్వారా ఇడ్లీ, దోశ, వడలు, పొంగ‌లి, రోటీ వంటివి విక్రయిస్తూ బెంగళూరులో తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బెంగళూరు లోని ఇతర కెఫేలు మాదిరిగా కాకుండా వీరు ఫ్రిజ్ వంటివి కూడా వాడరు, అందువల్ల పదార్థాలు ఎప్పుడు చాలా రుచికరంగా ఉంటాయని వినియోగదారులు చెబుతుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటున్నారు.

rameshwaram divya success story

ప్రస్తుతం బెంగళూరులో నాలుగు కెఫేలు నడుపుతున్నారు, కాగా రానున్న రోజులో దేశం మొత్తం మీదనే కాకుండా విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు దివ్య చెబుతోంది. ఈమె అటు సీఏ కెరీర్ ఇటు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కొన్ని నివేదికల ప్రకారం నెలకు సుమారు రూ.4.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ జరుగుతున్నట్లు సమాచారం.

Previous articleఅల్లు అర్జున్ ని ఎందుకు ఇలా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..? అల్లు అర్జున్ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది..?
Next article19 ఏళ్ల క్రితం ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు అదే యాక్టర్ కి తల్లిగా రమ్య కృష్ణన్.! ఆ హీరో ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.