Ads
మీరు కొత్త ఫ్రిడ్జ్ ని కొనాలని అనుకుంటున్నారా..? ఏ ఫ్రిడ్జ్ కొంటే బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారా..? మీ భర్త డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? డబల్ డోర్, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఏది బెటర్ అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు దీనిని చూడాల్సిందే, కచ్చితంగా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి.
ఫ్రిడ్జ్ లేకపోతే చాలా ఆహార పదార్థాలు వృధా అయిపోతూ ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేసేటప్పుడు ఏది మంచి ఫ్రిడ్జ్ అనేది మీరు తప్పక తెలుసుకొని అప్పుడే తీసుకోవాలి. లేకపోతే అనవసరంగా డబ్బులని వృధా చేసుకుంటారు.
సింగిల్ డోర్ ఫ్రిజ్ కి డబల్ డోర్ కి తేడా..?
సింగిల్ డోర్ ఫ్రిజ్ లో అయితే ఫ్రీజర్ ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది. దానికి మరొక డోర్ ని ఇస్తారు. అదే డబల్ డోర్ ఫ్రిజ్ లో అయితే ఫ్రీజర్ కూడా సపరేట్ గా ఉంటుంది. అవసరాన్ని బట్టి మనం ఫ్రీజర్ ని కూడా ఫ్రిడ్జ్ కింద మార్చుకోవచ్చు. అలానే ఈ రెండు ఫ్రిడ్జ్ లకి మధ్య ఉండే ముఖ్యమైన తేడా ఏమిటంటే.. డైరెక్ట్ కూల్, ఫాస్ట్ ఫ్రీ. అయితే డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్లని తక్కువ ధరకే మనం కొనొచ్చు.
Ads
మీరు తక్కువ బడ్జెట్ తో కొనాలి అనుకుంటే ఇటువంటి వాటిని ఎంపిక చేసుకోండి. డైరెక్ట్ కూల్ ఫ్రిజ్‌లలో టెంపరేచర్ ని మనమే కంట్రోల్ చేయాలి. ఫ్రీజర్ లో మనం ఏ టెంపరేచర్ ని సెట్ చేస్తే ఆ టెంపరేచర్ తో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఒకవేళ కనుక ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఎక్కువైతే గడ్డ కడుతుంది. అప్పుడు మనం వాటిని కరిగించుకోవడానికి ఒక బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక వీటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే ఓవర్ ఫ్లో అయిపోతుంది. కానీ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రీజ్ లలో మాత్రం ఈ ఇబ్బంది ఉండదు. టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా మారిపోతూ ఉంటుంది. మనం ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలుకి తగ్గట్టుగా టెంపరేచర్ మారుతుంది దీని మూలంగా కూరగాయలు మొదలైనవి పాడైపోవు. అలానే ఐస్ గడ్డ కట్టడం వంటి సమస్యలు ఇందులో రావు.