మంగళవారం సినిమా చూసి గూగుల్లో దాని గురించి వెతుకుతున్న నెటిజెన్స్.. అదేంటో తెలుసా?

Ads

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇదే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ని తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ లను మాత్రం రాబట్టలేకపోయింది.

అయితే ఈ సినిమాలో దర్శకుడు హైపర్ సె-క్స్ డిజార్డర్ అనే ఒక అనారోగ్య సమస్యని ఈ సినిమాలో చూపించాడని రివ్యూస్ లో రావడంతో… ఆ అనారోగ్య సమస్య అంటే ఏంటో వెతుకులాట మొదలుపెట్టారు. ఎక్కువ శాతం మంది నెటిజన్స్ ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభించినప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండడంతో చాలా వరకు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. దానికి తోడు మ్యాచ్ ఓడిపోవడంతో అందరూ ఆ బాధలోనే ఇంకా ఉన్నారు. దీంతో సినిమా హిట్ అయినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనకబడిపోయింది.

Ads

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న పాయల్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆమె ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇక ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ది.

Previous articleసడన్ గా ఓటీటీలో దర్శనమిచ్చిన ఈ సినిమా చూసారా.? విడుదల అయ్యి నెల కూడా కాలేదు అప్పుడే.!
Next articleమొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫొటోస్…ఎవరో గుర్తుపట్టారా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.