Ads
ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోన్న పాట ‘లింగి లింగి లింగిడి’. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ ఒక్క ఫోక్ సాంగ్ ‘కోటబొమ్మాళి పీఎస్’ మూవీ పై అంచనాలు పెంచింది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- మూవీ: కోటబొమ్మాళి పీఎస్
- నటీనటుల: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తదితరులు..
- దర్శకుడు: తేజ మార్ని
- సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
- నిర్మాత : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
- రిలీజ్ డేట్: నవంబర్ 24, 2023
స్టోరీ:
వృత్తికి న్యాయం చేయాలనుకునే పోలీస్, తన పదవికి న్యాయం చేయాలనుకునే పొలిటీషియన్, ఓటును డబ్బు కోసం అమ్ముకునే ఓటరు, ఈ ముగ్గురి మధ్యలో చిక్కుకున్న ముగ్గురు పోలీసుల స్టోరీనే ఈ మూవీ. ముగ్గురు పోలీసులు (శ్రీకాంత్, రాహుల్ విజయ్ , శివానీ రాజశేఖర్) లు ఒకసారి పార్టీకి వెళ్ళి, తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ చేస్తారు.
ఆ యాక్సిడెంట్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి మరణిస్తాడు. దాంతో ఆ ముగ్గురు పోలీసులు పారిపోతారు. వీరిపై పగ పెంచుకున్న కొందరు రాజకీయ నాయకులు, అన్యాయంగా కేసులు పెడతారు. పోలీసులు వీరిని వెతుకుతూ ఉంటారు. చివరికి వీళ్ళు దొరికిపోయే సమయానికి శ్రీకాంత్ క్యారెక్టర్ ఊహించని పని చేస్తుంది. అది రాజకీయ నాయకులకు పెద్ద షాకిస్తుంది. అది ఏమిటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
Ads
రెండేళ్ల క్రితం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నయట్టు’ సినిమాని తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా మార్పులు చేసి, ‘కోటబొమ్మాళి పీఎస్’ టైటిల్ తో తెరకెక్కించారు. మలయాళంలో జోజు జార్జి చేసిన క్యారెక్టర్ ని తెలుగులో శ్రీకాంత్ చేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీకాంత్ ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా మరియు ఎఫ్ఐఆర్ రైటర్ గా, కూతురిని ప్రేమించే తండ్రిగా అద్భుతంగా నటించాడు.
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ పోటీపడి నటించారు. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ సన్నివేశాలు ఉత్కంఠ కలించేలా ఉన్నాయి. శ్రీకాంత్ నటనతో ఆకట్టుకున్నారు. తన పాత్రలో జీవించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. వ్యవస్థకు తల వంచే పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి తన పాత్రలో జీవించారు. మురళిశర్మ చక్కగా నటించాడు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, పవన్ తేజ్ కొణిదల వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
- శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్,
- దర్శకత్వం,
- డైలాగ్స్,
- ఎమోషనల్ సీన్స్,
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- పోలీసులను ఆ డిపార్ట్మెంట్ వారే తరమడం అనే విషయం కాస్త ఇల్లాజికల్ గా అనిపిస్తుంది.
రేటింగ్:
2.75/5
ట్యాగ్ లైన్ :
మూవీ బోర్ ఫీల్ కలగకపోయినా, డబ్బింగ్ మూవీ అవడం, ఇప్పటికే ఓటీటీలో చూసి ఉండడం వల్ల ఎక్కడో పూర్తిగా కనెక్ట్ కానీ భావన కలుగుతుంది. ఆ మూవీఈ చూడానికి వారికి, పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.
watch trailer :
Also Read: PERFUME REVIEW: సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టేసిన “పర్ ఫ్యూమ్” …స్టోరీ, రివ్యూ & రేటింగ్.!