Ads
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లతో ఆకట్టుకుంటుంది. ఒక్కోసారి నవ్విస్తూ, మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది.
Ads
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెట్టిన పోస్ట్ క్రికెట్ ప్రపంచంలో సెన్సేషన్ రేపుతోంది. ఆర్సీబీ సోషల్ మీడియా అడ్మిన్ ఎక్స్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్, బాబర్ అజామ్ ఫోటోను షేర్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ ముగియడంతో, ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 ఆక్షన్ దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. ఐపీఎల్లో ఇప్పటికే ప్లేయర్స్ ట్రేడింగ్(బదిలీలు) ప్రాసెస్ ప్రారంభం అవగా, ప్లేయర్స్ రిలీజ్, రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు నవంబర్ 26 డెడ్‌లైన్ అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఆర్సీబీ నెట్టింట్లో చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది.
పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఆర్సీబీ ట్రేడ్ విండో ద్వారా సొంతం చేసుకున్నట్టుగా పోస్ట్ చేసింది. పాకిస్తాన్ దేశమంతటికి 500 టన్నుల ఆశీర్వాద్ గోధుమ పిండిని బాబర్ ఆజమ్ కు కోసం అందిస్తామని ఆర్సీబీ చేసిన పోస్ట్ సారాంశం. అంతేకాకుండా భారత జట్టులో రుతురాజ్ పాత్రను బాబర్ ఆజమ్ ఆర్సీబీలో పోషిస్తాడని ఆ పోస్ట్ లో తెలిపింది.
రుతురాజ్ టీమిండియా ఓపెనర్, అంటే ఆర్సీబీ జట్టు ఓపెనర్‌గా బాబర్ ఆజమ్ ఆడబోతున్నాడనట్టుగా పోస్ట్ లో పేర్కొంది. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ కి దిగుతాడని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రజలు వరదలు, ఆర్ధిక ఇబ్బందులతో గడ్డు పరిస్థితులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం అక్కడ గోధుమ పిండి కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ బాబర్ ఆజమ్‌కు బదులుగా పాకిస్థాన్ కు ఆశీర్వాద్ గోధుమ పిండిని అందిస్తామని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read: IPL 2024: ఈసారి IPL లో చేయబోతున్న భారీ మార్పులు ఇవే..!