భారతీయ క్రికెటర్లని అగౌరవపరిచేలా ఈ పోస్ట్ ఏంటి..? ఒక్క కాన్పులో 11 మంది అంటూ..?

సరిగ్గా వారం రోజుల కిందట ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇండియా తప్పకుండా గెలుస్తుంది అని కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ టీమిండియా ఓటమి పాలవడంతో ఆ విషయాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోయారు.

దీంతో ఆ మ్యాచ్ అయిపోయినా కూడా 4,5 రోజుల వరకు ఆ విషయం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి భారత క్రికెటర్లు అలాగే క్రికెట్ అభిమానులు బయటపడుతున్న సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల అత్యుత్సాహం సృతి మించుతోంది.

రోజు రోజుకి వారి ఆగడాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గత ఆదివారం ప్రపంచకప్ ముగిసిన వెంటనే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే కంగారూ ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ట్రోఫీ మీద కాలిబెట్టిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన ఇంకా మరువక ముందే తాజాగా ఆస్ట్రేలియా మీడియా చేసిన ఒక అభ్యంతరకర పోస్టును ఆసీస్‌ ఆటగాళ్లు లైక్‌, కామెంట్‌ చేయడం భారతీయ క్రికెట్‌ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తోంది.

టీమిండియా ను కించపరిచేలా ఉన్న ఆ పోస్టుపై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌లు లైక్‌ చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. బెటూటా అడ్వకేట్‌ అనే మ్యాగజైన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక మహిళ ప్రసవించిన ఫోటోను మార్ఫ్‌ చేసింది. మహిళ ఫేస్‌లోఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను పెట్టి.. సౌత్‌ ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్‌ హెడ్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే విధంగా ఒకే కాన్పులో 11 మంది మగపిల్లలకు జన్మనిచ్చాడు అంటూ పోస్టులో రాసుకొచ్చింది. చిన్నపిల్లల ముఖాలకు బదులు భారత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజాల ఫేస్‌లను మార్ఫ్‌ చేసింది.

post on cricketers

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టును మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌లతో పాటు ఆసీస్‌ మాజీ సారథి ఆరోన్‌ ఫించ్‌లు లైక్‌ చేశారు. కమిన్స్‌ అయితే మరో అడుగు ముందుకేసి నవ్వుతున్న ఎమోజీలు పెట్టి కామెంట్‌ కూడా చేయడం గమనార్హం. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆపోవచ్చు పై మండి పడటంతో పాటు ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ దారుణమైన ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఆసీస్‌ ఆటగాళ్లు, అక్కడి మీడియావ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమే అని మరీ ఇంత తలబిరుసు పనికిరాదని దుమ్మెత్తిపోస్తున్నారు.

ALSO READ : 500 టన్నులు అది ఇచ్చి…ఐపీఎల్ లో ఆ పాక్ ప్లేయర్ ని కొన్న RCB .! ఇదెక్కడి ట్రోల్ రా మావా.?

Previous article500 టన్నులు అది ఇచ్చి…ఐపీఎల్ లో ఆ పాక్ ప్లేయర్ ని కొన్న RCB .! ఇదెక్కడి ట్రోల్ రా మావా.?
Next articleఈ గొడవలోకి చిరంజీవిని ఎందుకు లాగారు..? అసలు చిరంజీవి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.