Ads
టాలీవుడ్ హీరోలు మలయాళ ఇండస్ట్రీ పై ఫోకస్ చేశారు. పలు మలయాళ చిత్రాలు ఇప్పటీకే తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళ రీమేక్ కోట బొమ్మాళి పీఎస్ మూవీ మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది.
అయితే గత రెండేళ్ల నుండి ఓ మలయాళ చిత్రం గురించి భారతీయ సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ మూవినే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. దేశవ్యాప్తంగా చర్చించుకునేంతగా ఈ మూవీలో ఏముందో? స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2021లో మలయాళంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, నిమిషా సజయన్ జంటగా నటించారు. ఈ మలయాళ మూవీకి జియో బేబీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా కేరళ రాష్ట్ర అవార్డు, జియోబేబీకి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు, ఉత్తమ సౌండ్ డిజైనర్ అవార్డును అందుకుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి క్లాసికల్ నృత్యం నేర్చుకుంటుంది.
డ్యాన్స్ టీచర్ కావాలని కలలు కంటుంది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆమెకు స్కూల్ టీచర్ తో పెళ్లి చేస్తారు. ఆమె భర్త కుటుంబ సంప్రదాయాలకు చాలా పట్టింపునిస్తుంటారు. స్త్రీలు అంటే ఇంటికే పరిమితం అని నమ్ముతుంటారు. వంటగదికి, ఇంటి పనులు చేయడమే స్త్రీల బాధ్యత అని భర్తతో పాటు, మామగారు చెబుతుంటారు. దాంతో అమే కలలు చెదిరిపోతాయి. అత్తింటి కట్టుబాట్లతో వంటింటికే పరిమితమవుతుంది. పాతకాలపు భర్త ఆలోచన విధానాలతో ఆమె ఎలాంటి సంఘర్షణను పడింది? తన కలల నిజం చేసుకోవడానికి ఆమె తీసుకున్న నిర్ణయమేమిటన్నదే మిగిలిన కథ.
అనాదిగా మహిళలలు వంటింటి కుందేళ్లుగా ఎలాంటి మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారో అనే విషయాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. స్త్రీలకు బాధలను చూపిస్తూనే , మరో వైపు మగవాళ్ళలో మార్పు కొంచెమైనా రాదు అన్నట్టుగా చూపించడంతో కొందరు పురుషులు హార్ట్ అయ్యారు. 25 ఏళ్ల కిందట తీయాల్సిన మూవీని ఇప్పుడు తీయడమెందుకు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారగా, శబరిమల అంశం కూడా చూపించడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఈ మూవీలో శబరిమలలో స్త్రీల ప్రవేశాన్ని సెకండ్ హాఫ్ లో కిలంకంగా చూపించాడు. శబరిమల ఆలయంలోకి స్త్రీలు ప్రవేశిస్తే తప్పేంటని అడిగిన ఒక ఫెమినిస్టు నివాసం పై కొందరు మతతత్త్వ వాదులు అటాక్ చేయడం, ఆ ఇన్సిడెంట్ ను హీరోయిన్ బలపరచినట్టుగా చూపించాడు. అంతేకాకుండా అయ్యప్ప మాల ధరించిన భక్తులపై హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మతపరమైన అంశాలను డైరెక్టర్ మహిళా సాధికారికతకు ముడి పెట్టి చూపించి, హిందూ ధర్మాన్ని అవమానపరిచాడని కొందరు మండిపడ్డారు. దాంతో ఈ మూవీ పై నేషనల్ వైడ్ గా చర్చ మొదలైంది.
అయితే మెజారిటీ ఆడియెన్స్, ప్రధానంగా మహిళలు ఈ మూవీని ఎక్కువగా ఆదరిచడంతో ఏప్రిల్ 4 నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని తమిళంలో రీమేక్ చేశారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ మూవీ రీమేక్ అవుతోంది. మలయాళ మూవీ యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.
Ads
watch movie:
Also Read: ANIMAL REVIEW : “రణబీర్ కపూర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!