23 ఏళ్ల తర్వాత బాలకృష్ణతో కలిసి పని చేయబోతున్న స్టార్ హీరోయిన్..! ఎవరంటే..?

Ads

విక్టరీ వెంకటేష్ ని టాప్ హీరోగా చేసిన సినిమా ప్రేమించుకుందాం రా మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగ రాసిందని చెప్పొచ్చు. ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీని తీసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.

అప్పటివరకు ఫ్యాక్షనిజంలో విల నిజాన్ని మాత్రమే చూసిన ప్రేక్షకులకు ఫ్యాక్షనిజంలో ఒక ప్రేమ కథని చూసి సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతోనే అంజలా ఝవేరి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవటంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అందరితోటి వరసగా సినిమాలు చేసింది.

this heroine to act in balakrishna movie after a long time

కొంతకాలం స్టార్ డంని ఎంజాయ్ చేసిన అంజలా ఝవేరి తరువాత పెళ్లి చేసుకుని ఇల్లాలిగా  స్థిరపడిపోయింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టిన ఈ భామ తన రీయంట్రి చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం తనని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో తీసుకోవాలని చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాలకృష్ణకి బోయపాటి ఈ సినిమా కథని చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ కోసం అంజలా ఝవేరి అయితే బాగుంటుంది అని బోయపాటికి రికమెండ్ చేయడం గమనార్హం.

Ads

this heroine to act in balakrishna movie after a long time

బోయపాటి కూడా అందుకు వెంటనే ఒప్పుకున్నాడంట. ఒక క్యారెక్టర్ వినగానే ఆ పాత్రకి అంజలా సరిపోతుంది అని బాలయ్య కి గుర్తు వచ్చిందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో గతంలో బాలయ్య బాబు సినిమాలో హనీ రోజ్ కు ఇచ్చినట్లు తల్లి పాత్ర ఇస్తారా లేదంటే ఇంద్ర సినిమాలో ఆర్తి అగర్వాల్ కి ఇచ్చినట్టు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే అంజలా జవేరి చేసే పాత్ర చాలా డీసెంట్గా ఉండబోతున్నట్లు సమాచారం

ALSO READ : ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు.. బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే..?

Previous article“సెలవులు వద్దు” అంటూ ఒక విద్యార్థి లేఖ..! కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
Next articleఈ సినిమా గురించి 2 సంవత్సరాల నుండి మాట్లాడుకుంటూనే ఉన్నారు..? అసలు ఏం ఉంది ఇందులో..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.