Ads
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయం వెనకాల రేవంత్ రెడ్డి హస్తము ఉందనేది అందరికీ తెలిసిన విషయమే.
రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడింది. కెసిఆర్ ని బిఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి ఆట ఆడుకున్నారు. అయితే చాలామందికి రేవంత్ రెడ్డి బ్యాగ్రౌండ్ గురించి తెలియదు.
రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి వంగూరులో నవంబర్ 6, 1969 లో జన్మించారు.
వీరిది వ్యవసాయ కుటుంబం. రేవంత్ రెడ్డి తండ్రి పేరు అనుముల నరసింహారెడ్డి,తల్లి అనుముల రామచంద్రమ్మ. చిన్నప్పటినుండి రేవంత్ రెడ్డికి రాజకీయాలంటే ఆసక్తి. కాలేజీ చదువుతున్నప్పుడు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడిగా ఉన్నారు.
Ads
కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహమాడారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో జడ్పిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో శాసనమండలి ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009,2014 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. 2017లో టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరినారు. రేవంత్ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేశారు. 2018 లోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కెసిఆర్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే దాని వెనకాల రేవంత్ రెడ్డి కష్టం చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందో వేచి చూడాలి