Ads
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు టిడిపికి లాభమా? వైసీపీకి లాభమా? అనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా నడుస్తుంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 17 గడిచిన ఒక రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు మరొక స్టేట్ పే ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.
తెలంగాణలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు ఏపీ నాయకులకి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా తెలంగాణ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే రాజకీయ నాయకులు. సంక్షేమానికి పెద్దపీట వేసినప్పటికీ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది బీఆర్ఎస్.అయితే ఆ పరిణామాలు ఏపీలో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తోంది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం అనేది తెదేపాకి ఊపిరిచ్చిందనే చెప్పవచ్చు ఎన్నాళ్ళు బిఆర్ఎస్ తో ఫ్రెండ్లీగా ఉన్న వైసీపీకి తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఇబ్బందిగా మారింది ఇదే కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే తమకు ఇబ్బందిగా మారుతుందని ఏపీలో చర్చ మొదలైంది. కాంగ్రెస్ గణ విజయం సాధించటంతో టిడిపి శ్రేణులు రోడ్డునక్కి సంబరాలు చేసుకుంటున్నాయి.
Ads
సాక్షాత్తు హైదరాబాదులోని రేవంత్ రెడ్డి నివాసంతో పాటు గాంధీభవన్ కి పసుపు జెండాలతో వెళ్లిన కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు ఒకప్పుడు టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించడంలో వారి ఆనందానికి అవధులు లేవు. ఏపీలో జరగనున్న ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేసేందుకు తెదేపా సిద్ధమైంది ఆ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దగ్గర ఎందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంది.
అయితే ఇదే విషయంగా సింహాచలంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడుని మీడియా ప్రశ్నించినప్పుడు కొత్త విషయంపై మాట్లాడేందుకు ఆయన పెద్దగా ఇష్టపడలేదు. ఏపీలో రాక్షస పాలన పోవాలని కోరుకుంటున్నట్లు మాత్రం తెలిపారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మీద పండగ చేసుకుంటుంటే వైసీపీ మాత్రం తమ వ్యూహాలకు పదును పెడుతుంది