Ads
రెక్కాడితే కానీ డొక్కాడని ఒక మామూలు రోజు కూలి అతను.. అలాంటిది అతని కొడుకు అనుకోకుండా దారుణంగా హ-త్య చేయబడ్డాడు. కొడుకుకు న్యాయం చేయడం కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు.. న్యాయం చేయమని అధికారులను వేడుకొన్నాడు.
నష్టపరిహారం ఇప్పిస్తాం అనే వారే తప్ప నిందితులను అరెస్టు చేయించే నాధుడే లేడు. దీంతో వ్యవస్థ పై ఒళ్ళు మండి ఎన్నికల్లో నిలబడ్డాడు. కొడుకు ఫోటో తోటే ప్రచారం చేసి.. ఆ నియోజకవర్గ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఒకే ఒక్క దెబ్బతో మట్టి కరిపించి విజయం
సాధించాడు.
ఇది చోటు చేసుకుంది మరి ఎక్కడో కాదు..చత్తీస్గఢ్ లోని బెమెతార జిల్లాలోని బీరన్పూర్ లో జరిగిన ఈ వింత ప్రస్తుతం హాట్ డిస్కషన్ గా మారింది.బీరన్పూర్ లో రోజు కూలీ గా ఉండే ఈశ్వర్ సాహు కొడుకు భువనేశ్వర్ సాహు.. కొద్దిరోజుల క్రితం ఆ ప్రాంతంలో చెలరేగిన మతపరమైన దాడిలో మరణించాడు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయకుండా నిందితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని సాహో ఆవేదన వ్యక్తం చేశాడు.
Ads
ఎంత వేడుకున్నా.. ఎంత ప్రయత్నించినా.. తన కొడుక్కి న్యాయం జరగకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఈశ్వర్ సాహు కు అండగా నిలిచిన బీజేపీ ప్రభుత్వం అతనికి సాజా అసెంబ్లీ సీటు ఇచ్చి ప్రోత్సహించింది. ఆ నియోజకవర్గంలో నుంచి ఏడు సార్లు ఏకధాటిగా మంత్రిగా గెలిచిన రవీంద్ర చౌబేది. పై 5,196 ఓట్ల మెజారిటీతో సాహు గెలుపొందాడు. ప్రస్తుతం ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.