Ads
మనం ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వాష్ రూమ్ వస్తే అక్కడ ఉండే వాష్ రూమ్ ని ఉపయోగించుకుంటూ ఉంటాము. గవర్నమెంట్ కూడా రోడ్స్ మీద వాష్ రూమ్స్ ని నిర్మించింది. దీనితో మార్గం మధ్య లో ఎవరికీ కూడా ఎటువంటి సమస్య కలగదు.
అయితే చాలా మందికి ఉండే అనుమానం ఏమిటంటే క్రికెట్ ఆడే ఆటగాళ్లకు కనుక వాష్ రూమ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు..? ఆట లో వున్నప్పుడు ఆటగాళ్లకు కనుక వాష్ రూమ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం.
మనం క్రికెట్ మైదానంలో చూసినట్లయితే ఆటగాళ్లు ఆట ఆడటానికి వస్తారు. తర్వాత మళ్లీ అవుట్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు. అంతే కానీ ఆట ఆడుతున్నప్పుడు మాత్రం అటు ఇటు వెళ్ళరు. అయితే ఒకవేళ కనుక ఆటగాళ్లకు మధ్యలో ఇలాంటి సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ విషయానికి వస్తే.. వాష్ రూమ్ ఎమర్జెన్సీకి మాత్రం ఎటువంటి రూల్ లేదు. ఈ రూల్ వర్తించదు. మామూలుగా అయితే ఆటగాళ్ళు ఆట ఆడటానికి వస్తారు. మళ్ళీ అవుట్ అయిన తర్వాత వెళ్తారు. కానీ ఒకవేళ కనుక ఇటువంటి పరిస్థితి కలిగితే ఎటువంటి రూల్స్ ఉండవు.
Ads
ఇటువంటి ఇబ్బంది కూడా మధ్యలో సాధారణంగా ఆటగాళ్ళకి రాదు క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్ళకి ఎక్కువ నీరు చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకునే బ్రేక్ వస్తే అప్పుడు ఆ ఆటగాడు వాష్ రూమ్ కి వెళ్ళవచ్చు. అంతే కానీ మ్యాచ్ ముగిసే దాకా ఆటగాడు ఆపుకోవాల్సిన పని లేదు. ఈ సమయాల్లో వాళ్ళు వెళ్లి రావచ్చు. ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ధోని బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 44 వ ఓవర్ అప్పుడు వాష్ రూమ్ కి వెళ్ళాడు. ఆ టైం లో కోహ్లీ ధోని బాధ్యత తీసుకున్నాడు. టీమిండియా మేనేజర్ బిశ్వరూప్ దేయ్ ఓ ఇంటర్వ్యూ అప్పుడు ఈ జవాబు ఇచ్చాడు.