“పెళ్లి చూపులు” నుండి “ఫామిలీ స్టార్” వరకు “విజయ్ దేవరకొండ” రెమ్యూనరేషన్ లిస్ట్…ఏ సినిమాకి ఎంత అంటే.?

Ads

ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిన్న విడుదల అయ్యింది. గోవర్ధన్ అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా చూపించడానికి ప్రయత్నించారు. సినిమా పాటలు సినిమా విడుదలకి ముందే హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.కానీ ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది.

అయితే ఈ సినిమాకి కూడా విజయ్ దేవరకొండ ఎక్కువ మొత్తంలోనే పారితోషకం తీసుకున్నారు. మొదట ఈ సినిమాకి పారితోషకం తీసుకోకుండా, వచ్చే ప్రాఫిట్స్ లో భాగాలు తీసుకుందాం అని విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల అనుకున్నట్టు సమాచారం. కానీ తర్వాత సినిమా షూటింగ్ చాలా వాయిదా పడింది. అనుకున్న షెడ్యూల్ కంటే లేట్ అయ్యింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది.

అందుకే లాభాల్లో భాగాలు తీసుకుందాం అనే నిర్ణయాన్ని విరమించుకొని పారితోషకాన్ని తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ 15 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నారు. ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అయినట్టు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలకి ముందు అయ్యే బిజినెస్ కూడా మంచి మొత్తంలోనే జరిగింది. ఇది ఇలా ఉంటె…విజయ్ దేవరకొండ తన ఏ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో ఈ లిస్ట్ చూసేయండి.

#1 పెళ్లి చూపులు – 5 లక్షలు

విజయ్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులు. ముందు బడ్జెట్ అసలు సరిపోలేదు అని దాంతో విజయ్ దేవరకొండ బంధువైన యష్ రంగినేని నిర్మాణంలో కొంత పాత్ర పోషించారు అని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఆ సినిమాకి విజయ్ అందుకున్న పారితోషకం ఐదు లక్షలు.

#2 ద్వారక – 20 లక్షలు

పెళ్లి చూపులు సినిమా విజయ్ కి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత ద్వారకా లాంటి కమర్షియల్ సినిమా చేశాడు. దర్శకుడు సినిమా నెరేట్ చేసినప్పుడు ఒకలాగా ఉంది అని తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు సినిమా ఇంకొక లాగ వచ్చింది అని. షూటింగ్ సమయంలోనే ఫలితం అర్థమైపోయింది అని కానీ సినిమా ఒప్పుకోవడం తన నిర్ణయమే అని కాబట్టి రిగ్రెట్ చేయడం లేదు విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Ads

#3 అర్జున్ రెడ్డి – 5 లక్షలు

ఈ సినిమా పెళ్లిచూపులు తర్వాత మొదలైంది. కానీ షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన టెడ్ టాక్స్ యూట్యూబ్ లో ఉంది. ఆ వీడియో ఒకసారి చూస్తే ఎన్ని కష్టాలతో ఈ సినిమా బయటికి వచ్చిందో మీకే అర్థమవుతుంది.

#4 గీత గోవిందం – 5 లక్షలు

పెళ్లిచూపులు తర్వాత విజయ్ సైన్ చేసిన సినిమా గీత గోవిందం. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. దాంతో ఐదు లక్షలు పారితోషకం తీసుకున్నాడు విజయ్. ఈ సినిమా ద్వారా విజయ్ తన మొట్టమొదటి కమర్షియల్ మూవీ సక్సెస్ అందుకున్నాడు.

#5 నోటా – 3 కోట్లు

తమిళ్ లో రూపొంది తెలుగులోకి అనువాదం అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

#6 టాక్సీ వాలా – 5 కోట్లు

అనుకున్నంతగా కాకపోయినా ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

#7 డియర్ కామ్రేడ్ – 10 కోట్లు

తెలుగులో రూపొంది తమిళ, కన్నడ, మలయాళ, భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. కానీ ఎంతోమంది ప్రశంసించారు. దాంతో డియర్ కామ్రేడ్ అండర్ రేటెడ్ సినిమాల జాబితాలో చేరింది.

#8 వరల్డ్ ఫేమస్ లవర్ – 10 కోట్లు

#9లైగర్ – 12 కోట్లు

ఈ సినిమా మీద ప్రేక్షకులందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. విజయ్ కూడా ఈ సినిమా కోసం అంతే ఎక్కువగా కష్టపడుతున్నాడు. పోయిన చోటే తిరిగి తెచ్చుకోవాలి అని అంటారు. నాలుగు భాషల్లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఏ ఒక్క భాషలో కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు లైగర్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతోంది. కాబట్టి ఈ సినిమాతో ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆశిద్దాం.

#10. ఫ్యామిలీ స్టార్ – 15 కోట్లు

Previous articleIPL: ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లకు టాయిలెట్ వస్తే ఏం చేస్తారు..? వాష్ రూమ్ కి వెళ్లడం రూల్స్ ప్రకారం తప్పా..?
Next articleపూర్తిగా రూపం మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏమైంది అంటూ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.