Ads
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గురించి పాలు రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా నో కెప్టెన్ గా చేయడం పై రోహిత్ శర్మ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ను కాదని హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడం తో రోహిత్ ను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు ముంబై ఇండియన్స్ ను ఏకంగా అన్ ఫాలో చేసేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను బదిలీ చేసుకున్నప్పుడే అతను ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ అవుతాడు అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి మరొకసారి మొన్న జరిగిన వరల్డ్ కప్ గురించి చర్చలు వినిపిస్తున్నాయి .భారత్ కు వరల్డ్ కప్ లో రన్నరప్ గా మిగిలింది.అదే రోహిత్ సేన టైటిల్ గెలుచుకొని ఉంటే ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడవ కెప్టెన్ గా రోహిత్ శర్మ గుర్తింపు తెచ్చుకునేవాడు అప్పుడు ముంబై ఇండియన్స్ కు అతన్ని రీప్లేస్ చేసే ఆస్కారం ఉండేది కాదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
Ads
ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు ముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మరొకసారి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే.. మేము అన్ని మ్యాచ్‌లు వరుసగా గెలుస్తున్నాం కాబట్టి ప్రశంసిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన సరే.. నేను మంచి కెప్టెన్ కాదు అని ఓ చెత్త కాప్టన్ అని కచ్చితంగా అంటారు.. అని యదార్థం చెప్పాడు రోహిత్. ఇప్పుడు కెప్టెన్ గా అతని మార్చడం తో ఇది నిజమే కదా అంటున్నారు అందరూ.
మరోపక్క ఇండియన్స్‌లో రోహిత్ శర్మ 2024 సీజన్ వరకే ఉంటాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రతి టీం కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే తన దగ్గర అరటి పెట్టుకునే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాను పత్తి పెట్టుకుని రోహిత్ కి టాటా చెప్పే ఆస్కారం ఉంది. అంటే మెగా వేలంలో టీం ఇండియన్ కెప్టెన్ ఉంటాడు అని టాక్. అయితే ఐపీఎల్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేడుకగా జరగనుంది.