Ads
ఎక్కడో హాలీవుడ్ లో పుట్టి అక్కడ నుంచి బాలీవుడ్ లోకి వచ్చి అక్కడినుంచి తెలుగులోకి ప్రవేశించి మొత్తం రెండు రాష్ట్రాల్ని టీవీకి కట్టి పడేస్తున్న ప్రోగ్రాం బిగ్ బాస్. మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్ కన్నా తెలుగులో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ప్రోగ్రాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా సీజన్ సెవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. విన్నర్ ఎవరనేది పక్కన పెడితే అసలు గేమ్ విన్ అయిన విన్నర్స్ ఏం చేస్తున్నారు.
బిగ్ బాస్ గెలవడం వల్ల వాళ్ళ కెరియర్ కి ఏమైనా కలిసొచ్చిందా అనేది తెలుసుకుందాం. ముందుగా బిగ్ బాస్ సీజన్ తెలుగు వన్ విన్నర్ హీరో శివ బాలాజీ. బిగ్ బాస్ లో అతని రోల్ అందరినీ ఇంప్రెస్ చేసింది ఆ సీజన్ కి విజేతను చేసింది. బిగ్ బాస్ లోకి రాకముందు అతను చిన్న చిన్న సినిమాల్లో హీరో రోల్స్ చేసేవాడు తర్వాత ఆ రోల్స్ కూడా అతనికి రాలేదు. ఇప్పుడు సినిమాలు పరంగా అయితే ఎక్కడా కనిపించడం లేదు. అతని భార్య మధుమిత యూట్యూబ్ ఛానల్ లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఆ తర్వాత సీజన్ 2 విన్నర్ కౌశల్ మంద.
Ads
ఇతను కూడా బిగ్ బాస్ ముందు మోడలింగ్ షోస్, సీరియల్స్ చేస్తూ ఉండేవాడు. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఒక సీరియల్లో కానీ ఒక సినిమాలో కానీ కనిపించలేదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రం కనిపించి హడావుడి చేస్తూ ఉంటాడు తప్ప బిగ్ బాస్ వల్ల ప్రత్యేకంగా అతనికి ఒరిగిందేమీ లేదు. ఇక బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ బిగ్ బాస్ లోకి రాకముందే అతను కెరియర్ పరంగా ఫేడౌట్ అయిపోయాడు. బిగ్ బాస్ విన్న తర్వాత కూడా అసలు ఇండస్ట్రీలో కనిపించలేదు వరల్డ్ టూర్లు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ. ఇతను కూడా బిగ్ బాస్ విన్నింగ్ అనేది అతనికి కెరియర్ పరంగా ఏమాత్రం ఉపయోగపడలేదు టైటిల్ ట్రోఫీతో పాటు 50 లక్షలు క్యాష్ ప్రైస్, షాద్నగర్ లో సువర్ణభూమి నుంచి 25 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఒక టీవీఎస్ బైక్ గెలిచారు. ఇక సీజన్ 6 విన్నర్ రేవంత్ పేరు ఇప్పుడు ఎక్కడ అసలు వినిపించడమే లేదు కానీ బిగ్ బాస్ గెలవడం వల్ల పది లక్షలు అదనంగా క్యాస్ట్ తో పాటు సువర్ణభూమి వారి 650 గజాలు ప్లాట్ కూడా పొందాడు. అంటే బిగ్ బాస్ విన్ అవ్వటం వలన ఎవరికి పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది.