Ads
ఎన్టీ రామారావు తెలుగు సినిమా చరిత్రలో ఈయన పేరు సువర్ణ లిఖితం. తర్వాత రాజకీయాల్లోకి అరంగ్రటం చేసి అక్కడ కూడా చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డు తగిలి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అయితే ఒకప్పుడు రాష్ట్రమంతా తెలుగుదేశం గాలి వీచిన కూడా ఒకసారి ఎన్టీఆర్ కి ఎన్నికల్లో పరాభావం తప్పలేదు. ఎన్టీఆర్ ని అప్పట్లో ఓడించిన వ్యక్తి ఎవరు? ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం…!
1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓడిపోయారు తెలంగాణలో కల్వకుర్తిలో పోటీ చేసే ఆయన ఓడిపోయారు. ఎన్టీఆర్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కొన్ని కారణాల వలన కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓడిపోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కి పోటీగా నిలిచింది చిత్తరంజన్ దాస్. ఆయనకు ఇప్పుడు 72 సంవత్సరాలు. రాజకీయాల్లో ఈయన ఇంకా కొనసాగుతున్నారు.విద్యార్థి దశ నుండి కూడా ఈయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
Ads
1989 లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పై పోటీ చేసి ఆయనని ఓడించి తెలుగు రాజకీయాల్లో హైలైట్ గా నిలిచారు. తర్వాత ఈయన మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత మళ్ళీ జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. 1999 లో టికెట్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
చిత్తరంజన్ దాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓబిసి సెల్ చైర్మన్ గా పని చేశారు. 2018లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. లోక్సభ ఎన్నికల సందర్భంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సెప్టెంబర్ 30నబీజేపీ పార్టీలో చేరారు.