Ads
ఒకప్పుడు ఒక భాషలో బాగా హిట్ అయిన సినిమాలని పరాయి భాషలోకి డబ్చేసేవారు ఆ డబ్బింగ్ సినిమాలకి మంచి క్రేజ్ ఉండేది ఆ తర్వాత వాటిని రీమేక్ చేయడం ప్రారంభించారు అవి కూడా కొన్ని రోజులు వాటి హవా కొనసాగించాయి. అయితే కరోనా తర్వాత, ఓటిటిలో సినిమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి లాంగ్వేజ్ సినిమాని నచ్చితే సబ్ టైటిల్స్ వేసుకొని మరీ చూస్తున్నారు జనాలు. ఇలాంటి సమయంలో కూడా రీమిక్స్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు చాలామంది నిర్మాతలు అలా ఇప్పటివరకు రీ మేక్ అయిన సినిమాలు ఏమిటో చూద్దాం.
భోళా శంకర్ : ఇది తెలుగులో ఆవేశం అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది. అయినప్పటికీ ఈ సినిమాకి బోలా శంకర్ పేరు పెట్టి చిరంజీవిని హీరోగా పెట్టి తీశారు.
గాడ్ ఫాదర్: ఇది మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగులో అదే పేరుతో డబ్ అయింది. అయితే చిరంజీవిని హీరోగా పెట్టి అదే కథని గాడ్ ఫాదర్ గా తెలుగులో మళ్లీ రీమేక్ చేశారు.
లీలామహల్ సెంటర్ : ఇది తమిళంలో హిట్ అయిన అమర్కలం సినిమాకి రీమేక్ అయితే అమర్కలం అద్భుతం అనే పేరుతో తెలుగులోకి ముందే డబ్ అయింది.
Ads
గద్దల కొండ గణేష్ : ఈ సినిమా తమిళంలో హిట్ అయిన జిగర్తాండ సినిమాకి రీమేక్ ఇది కూడా తెలుగులో చిక్కడు దొరకడు పేరుతో రిలీజ్ అయింది.
డియర్ మేఘ: ఇది దియా అనే సూపర్ డూపర్ హిట్ అయిన కన్నడ సినిమా రీమేక్. అయితే ఈ సినిమా రావడానికి ముందే దియా పేరుతోనే తెలుగులో కూడా డబ్ అయింది ఈ సినిమా.
తేరీ: తమిళంలో విజయ్ హీరోగా నటించిన సినిమా తేరి ఈ సినిమా ఆల్రెడీ పోలీస్ అనే పేరుతో తెలుగులో కూడా డబ్బైంది కానీ ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
కాటమరాయుడు: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ సినిమా అయినా వీరంకి రీమేక్. అయితే వీరుడొక్కడే అనే పేరుతో అప్పటికే తెలుగులోకి డబ్ అయింది ఈ సినిమా.
నీ జతగా నేనుండాలి: హిందీ సినిమా ఆషికి కి రీమేక్ ఇది ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది అయినప్పటికీ రీమేక్ చేయడం విశేషం.
బ్రో: ఈ సినిమా తమిళంలో హిట్ అయిన మూవీ, ఈ సినిమా కూడా తెలుగులో డబ్బైంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఈ సినిమాని తెలుగులో తీశారు.