Ads
హిస్టారికల్ సినిమాల తీసి హిట్లు కొట్టడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం. మొగల్ సామ్రాజ్యాన్ని తెరపై ఆవిష్కరించడం దగ్గర నుండి మొన్న వచ్చిన బాహుబలి వరకు ఇదే ఫీట్ రిపీట్ అవుతుంది.అయితే ఒక్క సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
బాలీవుడ్ ఇండస్ట్రీని అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. అదే హేమా మాలిని, ధర్మేంద్ర ప్రధానపాత్రల్లో నటించిన ఢిల్లీ సుల్తాన్స్ వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ రూలర్ రజియా సుల్తాన్ బయోపిక్.
Ads
అప్పుట్లో రూ. 10కోట్ల బడ్జెట్‌తో 1975లో ప్రారంభమైన ఈ చిత్రం కాస్టింగ్ చేంజెస్ కారణంగా ఫైనల్‌గా 1983లో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 2కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఉర్దూ భాషను వినియోగించడం కాంట్రవర్సీ కాగా, స్లో న్యారేషన్ చిత్రానికి మైనస్‌గా మారింది. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇన్వెస్టర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది.
అయితే రజియా సుల్తాన్ నిర్మాత కమల్ అమ్రోహి మాత్రం ఈ సినిమాను క్లాసిక్ ఫిల్మ్‌గా వర్ణించాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరిగ్గా అర్థం కాలేదని, సాధారణంగా సినిమాల్లో ఉండే మసాలా కంటెంట్ ఈ సినిమాలో లేకపోవడం కారణంగా పాకీజా,షోలే సినిమాల రేంజ్ లో హిట్ అందుకోలేకపోయిందన్నారు.