Ads
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి సరైన హిట్టు లేదనేది మాత్రం నిజం. ఆయన ఫ్యాన్స్ ప్రభాస్ ని సరైన అవతార్ లో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఫుల్ మాస్ మూవీ చేశాడు ప్రభాస్, అదే సలార్. ఈ మూవీ నేడు విడుదలైంది. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…!
- చిత్రం: సలార్
- నటీనటులు: ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు, ఈశ్వరి రావు, గరుడ రామ్, శ్రీయరెడ్డి తదితరులు.
- దర్శకుడు: ప్రశాంత్ నీల్
- నిర్మాతలు: హోంబెల్ ఫిలిమ్స్
- మ్యూజిక్: రవి బస్రుర్
- డిఓపి: భువన్ గౌడ
- ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
కథ:
అమెరికాలో పుట్టిన ఆద్య (శృతి హాసన్)తన తండ్రికి తెలియకుండా ఇండియాకి వస్తుంది. ఇండియాకు వచ్చిన ఆమెను కిడ్నాప్ చేసేందుకు పలు గ్యాంగులు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆమెను రక్షించగలిగేది ఒక్కడే అని అస్సాం బర్మా బొగ్గు గనులలో పని చేసే దేవరథ అలియాస్ దేవ (ప్రభాస్) వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ దేవా బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉంటే ఆమె తల్లి ఈశ్వరి రావు స్కూలు పిల్లలకు చదువు చెబుతూ ఉంటుంది. ఆమె హింస అంటే భయపడుతూ కొడుకు చేతిలో చిన్న కత్తి చూసిన ఆందోళనకి గురవుతుంది.
అసలు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది? వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్ )ప్రాణాల మీదకు వస్తుందనుకున్న సమయంలో దేవా వెళ్లి అతనిని కాపాడాడ? ప్రాణ స్నేహితులు ఇద్దరు శత్రువులుగా ఎందుకు మారారు? అజ్ఞాతంలోకి వెళ్లిన దేవా ఏమయ్యాడు? అతనిని రప్పించడానికి రాధా రామ (శ్రేయ రెడ్డి) ఏం చేసింది? ఈ కథలో ఖాన్సార్ అధినేత రాజమన్నార్ పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే పూర్తి సినిమాను చూడాల్సిందే.
రివ్యూ:
కేజిఎఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం నిలబెట్టుకునేలాగా ప్రభాస్ ని మాస్ అవతారంలో చూపిస్తూ ప్రశాంత్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. కేజిఎఫ్ లో కథతో పాటు ఎమోషన్, ఎలివేషన్ మిక్స్ చేసిన ప్రశాంత్ సాలార్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. ముందు నుంచి రెండు పార్ట్ లు అని చెప్పడంతో మొదటి పార్ట్ ఎంతవరకు చూపించాలి అనేది ఫిక్స్ అయిపోయి తీసినట్టున్నాడు.
Ads
ప్రభాస్ ని మంచి మంచి ఎలివేషన్స్ లో చూపిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అయితే కథ మీద పెద్దగా దృష్టి సారించలేదు. సెకండ్ హాఫ్ లో కథలోకి వెళ్ళేకొద్ది ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. అయితే తన మేకింగ్ తో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ ఆ తప్పులన్నీటిని మరిచిపోయేలా చేసాడు. కథ కథనం విషయంలో కాస్త దృష్టి సారిస్తే బాగుండేది, మిగతా విషయాల్లో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.
చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకుంటున్నాడో అలా కనిపించాడు. చాలా సీన్లలో కళ్ళతోటే హావ భావాలు పలికించాడు. స్క్రీన్ మొత్తం తనే ఆక్రమించేశాడు. యాక్షన్ సీన్స్ తో అదరహో అనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ సినిమా మొత్తం విజృంభించేసాడు అనాలి. నటుడు పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ తో పోటీపడి మరి నటించాడు. ఆయనకి సమానంగా ఉండే పాత్ర. ఈశ్వరి రావు పాత్ర కూడా చాలా బాగుంది. శృతిహాసన్ పాత్ర పరవాలేదు అని చెప్పొచ్చు.
ఇక జగపతిబాబు, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, గరుడ రామ్, బాబి సింహ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక రవిబస్రుర్ సంగీతం నేపద్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. భువన గౌడ సినిమాటోగ్రఫీ కూడా సినిమాని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి
ప్లస్ పాయింట్స్:
- ప్రభాస్ వన్ మ్యాన్ షో
- యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్
- నేపథ్య సంగీతం
- సినిమా మేకింగ్
మైనస్ పాయింట్స్:
- కథ
- అర్థం కాని కథనం
రేటింగ్:
3.25/5
ఫైనల్ గా:
ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మాస్ సినిమాలో ఇష్టపడే వారికి కూడా ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు
watch trailer :
ALSO READ : పవన్ తో జక్కన్న రైటర్ మూవీ..! ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా..?