Ads
పాన్ ఇండియన్ స్టార్ అంటే మనకి మొదట ప్రభాస్ గుర్తుకు వస్తాడు. అయితే ఆ ప్రభాస్ ని పాన్ ఇండియన్ స్టార్ గా చేసిన డైరెక్టర్ మరెవరో కాదు రాజమౌళి. రాజమౌళికి ఇప్పుడు ఉన్న క్రేజ్ మరి ఏ స్టార్ డైరెక్టర్ కి లేదు. పాన్ ఇండియా డైరెక్టర్ల లో ఫస్ట్ వచ్చే పేరు రాజమౌళిదే. రాజమౌళి బాహుబలి సినిమా తీసిన తర్వాత అటు నార్త్ లో సంజయ్ లీల భన్సాలీ, ఇటు సౌత్ లో శంకర్, మణిరత్నం లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లను కూడా వెనక్కి నెట్టేసాడు.
బాహుబలి రెండు పార్ట్స్ విడుదల తర్వాత రాజమౌళికి, ప్రభాస్ కి ఇద్దరికీ తిరుగులేకుండా పోయింది. మొన్న మొన్న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా మంచి హిట్ ని అందుకుని కలెక్షన్లు వర్షం కురిపించింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అది హిట్ అనే టాక్ వచ్చింది. అయితే రాజమౌళి తన కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలను మధ్యలోనే ఆపేసాడట.
Ads
బడ్జెట్ పరంగానో లేకపోతే హీరోకి తనకి కమ్యూనికేషన్ లేకపోవడం వలనో కొన్ని సినిమాలను మధ్యలోనే ఆపేసారట రాజమౌళి. అవేంటో తెలుసా? మొదట ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసిన తర్వాత మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ఒక మైథాలజికల్ సినిమా తీయాలి అనుకున్నారట కానీ అది మొదట్లోనే ఆగిపోయింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కొడుకు అయిన సూర్య ప్రకాష్ ని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకున్నారట.
కానీ అది కూడా మొదట్లోనే ఆపేసారట. సూర్య ప్రకాష్ కి మొదట్లోనే ఫ్లాపులు రావడం దీని వెనక ఉన్న కారణం అని అంటున్నారు. అయితే అప్పుడు ఆ సినిమాలను ఆపేసిన తర్వాత ఇప్పటికొచ్చి ఆ సినిమాలు గురించి ఎటువంటి ప్రస్తావన కూడా లేదు. ఏ సినిమా అయినా నేను 100% ఎఫర్ట్ పెట్టి తీస్తాను. అది ఒకవేళ నాకు నచ్చకపోతే తీయను అని చెప్పారు. ఇదిలా ఉండగా రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు తో తీస్తున్నారు. అది ఎప్పుడు విడుదలవుతుందో రాజమౌళికే తెలియాలి.