ఆశ చాక్లెట్ కంపెనీ ఎందుకు మూత పడిందో తెలుసా..? ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తిన్నాము…కానీ.?

Ads

ఆశ మరియు మహా లాక్టో చాక్లెట్స్ గురించి ఇప్పటివారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ 90-2000ల పిల్లలందరూ చాలా ఇష్టపడే చాక్లెట్స్ ఇవి. అప్పటివారికి వాటి పేరు వినగానే అవి కళ్ల ముందు మెదులుతాయి. స్కూల్ కు వెళ్ళే పిల్లల జేబులో తప్పక ఉండేవి.

ఆ రోజుల్లో చాక్లెట్ అనగానే గుర్తొచ్చేది ఆశ. కొన్నేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఈ చాక్లెట్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఆ బ్రాండ్ కనుమరుగు అయ్యింది. అందరూ అంతగా ఇష్టపడిన ఆశ చాక్లెట్ కంపెనీ ఎందుకు మూతపడిందో ఇప్పుడు చూద్దాం..
ఆశ చాక్లెట్ దాదాపు పదేళ్ళ పాటు అత్యంత పాపులర్ అయ్యింది. ఆ సమయంలో పుట్టినరోజు వచ్చిందంటే తప్పనిసరిగా ఆశ చాక్లెట్ ఉండాల్సిందే. న్యూట్రిన్ మహా లాక్టో మరియు ఆశ చాక్లెట్ రెండు న్యూట్రిన్ బ్రాండ్ చాక్లెట్‌లు 90-2000ల టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ చాక్లెట్ లేని షాప్ లేదని చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడేవారు. చిత్తూరు జిల్లాకు చెందిన బి వెంకట్రామా రెడ్డి 1952లో న్యూట్రిన్ కంపెనీని స్థాపించించారు.
పిల్లల కోసం తక్కువ పెట్టుబడితో, క్వాలిటీ ఉన్న చాక్లెట్స్ ను తయారు చేయడం కోసం న్యూట్రిన్ కంపెనీని మొదలుపెట్టారు. జిల్లావారికి పనికి కల్పించడం కోసం అక్కడే కంపెనీని పెట్టారు. 60 మందితో మొదలైన కంపెనీ ఆ తరువాత కాలంలో 600 మందికి పెరిగింది. ఆ కాలంలో న్యూట్రిన్ చాక్లెట్స్ కు ఆ  రోజుల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రతిరోజూ 12 వందల టన్నుల చాక్లెట్స్ ని తయారు చేసేదని తెలుస్తోంది. ఇతర దేశాలకు కూడా ఈ చాక్లెట్స్ ఎగుమతి అయ్యేవి.
కానీ 2000 తరువాత విదేశీ కంపెనీల చాక్లెట్స్ రాకతో న్యూట్రిన్ కొనుగోలు తగ్గింది. రోజురోజుకూ మార్కెట్లో కొత్త కొత్త రకాల చాక్లెట్స్ వస్తుండటంతో ప్రజలు పాత వాటి వైపు చూడలేకపోయారు. అలా విదేశీ కంపెనీల చాక్లెట్స్ ముందు మన దేశ బ్రాండ్ వెలవెలబోయింది. న్యూట్రిన్ నష్టాలు రావడంతో గోద్రెజ్ కు 49 శాతం వాటా అమ్మింది. కానీ గోద్రెజ్ నడపలేక అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్‌ హెర్షేకి విక్రయించింది. అప్పటి నుండి న్యూట్రిన్ బ్రాండ్‌ చాక్లెట్స్ మెల్లగా కనుమరుగయ్యాయి.

Ads

article sourced from: teluguwaves

Also Read: ఈరోజుల్లో కూడా ఇలాంటి హోటల్ ఉందా..? విజయవాడలో వాళ్ళకి తెలిసే ఉంటది..!

Previous articleరాజమౌళి కెరీర్ లో ఆ రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి…కారణం ఏంటంటే.?
Next articleఅబ్బాయిలూ ఇది మీకోసమే…ఈ నాలుగు విషయాలు నేర్చుకోకుండా పెళ్లికి మాత్రం రెడీ అవ్వకండి.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.