1960 ‘స్ లోనే ట్రోలింగ్ కి గురైన ఈ నటి ఎవరో తెలుసా.? సోషల్ మీడియా లేని టైం లోనే అలా అంటే.?

Ads

ఇప్పుడంటే భారతదేశంలో బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ హీరోయిన్లు బికినీలు వాడడం సహజమైపోయింది. కానీ ఆనాటి కాలంలో భారత స్త్రీ కెమెరా ముందు బికినీ వేసుకొని కనిపిస్తే అది ఎంతో పెద్ద విషయం. అయితే హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఆనాటి కాలంలోనే బికినీ వేసుకొని కనిపించింది. దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఆనాటి కాలంలో ఈమె తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే నిలిచేది. షర్మిల ఠాగూర్ నటనకి రెండు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. సోషల్ మీడియా లేకపోయినా సరే ట్రోలింగ్ కి గురైన ఆనాటి స్టార్ హీరోయిన్ ఈనాడు కాఫీ విత్ కరణ్ షో లో మెరుపుతీగలా మెరిసింది. అప్పటి విషయాలు గురించి మాట్లాడుతూ “ఆన్ ఈవినింగ్ ఇన్ పారిస్” అనే సినిమా కోసం నేను ఒక బికినీ షూట్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో బికినీ షూట్ అంటే అది చాలా పెద్ద విషయం.

Ads

సినిమాలో ఉన్న కెమెరామెన్ మిగిలిన వాళ్ళు కూడా అది ఎంతో భయం గా షూట్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఇండియా వైడ్ గా అందరూ ఈ పనికి నా మీద కోపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం పార్లమెంటరీ వరకు వెళ్లింది. అప్పటినుంచి నేను సినిమాలను, స్క్రిప్ట్ లను ఎన్నుకొని నటించాను. ఇప్పుడంటే ఈ బికినీలు అన్నీ చాలా మామూలు విషయం అయిపోయాయి కాని అప్పుడు దేశమంతా నా మీద తిరగబడింది అన్నట్టుగా చెప్పారు షర్మిల ఠాగూర్.

బాలీవుడ్ లో రెండు తరాల వరకు తీసిన ప్రతి సినిమా హిట్ అయిన షర్మిలా టాగూర్ తను ప్రేమించిన వ్యక్తి కోసం మతం మారి మరీ తనని పెళ్లి చేసుకుంది. అయితే మీకు తెలియని ఇంకో విషయం ఏంటో తెలుసా? షర్మిల ఠాగూర్ ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కి సొంత తమ్ముడు మనవరాలు. కాఫీ విత్ కరణ్ లో తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు గురించి చెప్పుకుంటూ వచ్చింది షర్మిల.

Previous articleపాకిస్థాన్ లో కరెంటు ఇంజిన్ ఎందుకు ఉండవు..? కారణం చూస్తే షాక్ అవుతారు..!
Next articleఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు ఏఎన్ఆర్ కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో తెలుసా.? కానీ అంతలోనే.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.