ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు ఏఎన్ఆర్ కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో తెలుసా.? కానీ అంతలోనే.!

Ads

అప్పట్లో తెలుగు వాళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్ లని పెద్దాయన, చిన్నాయన అని పిలుస్తూ వారికి ఎనలేని గౌరవాన్ని ఇచ్చేవారు. నిజంగానే వారిద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారు. ఇద్దరికీ మంచి అనుబంధం కూడా ఉండేది.ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు చేసేవారు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి కాంపిటేషన్ ఉండేది కాదు. అయితే కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని,ఎన్టీఆర్ కావాలనే ఏఎన్ఆర్ ని దూరం పెట్టారని చాలామంది అంటారు.

నిజా నిజాలు మనకు తెలియదు కానీ వీరికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకసారి ఏఎన్నార్  కి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.అప్పుడు ఏఎన్నార్ ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు. ఏఎన్ఆర్ “ఏంటి బ్రదర్” అని అడగగా ఎన్టీఆర్ నేను నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నాను, నా మనసులో మాట నీతో చెప్పుకోవాలి అనుకుంటున్నాను, ఒకసారి ఇంటికి వస్తారా అంటూ ఏఎన్ఆర్ ని అడిగారంట. ఆ మాటలకి ఏఎన్ఆర్ ఎంతో చలించి పోయారు. అలా అంటున్నారు ఏంటి బ్రదర్ ఈ మధ్యనే కదా ఇంటికి భోజనానికి వచ్చారు అని ఏఎన్ఆర్ అడిగారంట.

Ads

కాదు బ్రదర్ నీతో నా మనసులో బాధని చెప్పుకోవాలనిపిస్తుంది అంటూ ఎన్టీఆర్ అనటంతో తప్పకుండా కలుద్దాం బ్రదర్ అన్నారంట ఏఎన్ఆర్. ఇక ఆ ఫోన్ గురించి తన భార్యకి కూడా చెప్పి చాలా ఎక్సైట్ అయ్యారట. అయితే ఈ ఫోన్ వచ్చిన మరుసటి రోజే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ ఏఎన్నార్ కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పటం కోసమే ఆయనని ఇంటికి రమ్మన్నారు అని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. అంతలోనే ఎన్టీఆర్ మరణించడం విషాదకరం.

Previous article1960 ‘స్ లోనే ట్రోలింగ్ కి గురైన ఈ నటి ఎవరో తెలుసా.? సోషల్ మీడియా లేని టైం లోనే అలా అంటే.?
Next articleబాలకృష్ణ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.