Ads
ప్రతి వ్యక్తి లైఫ్ లో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. పెళ్ళంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. ఆ తరువాత పెళ్లి వయసు వచ్చిన తరువాత పెళ్లి సంబంధాలు చూసి, ఘనంగా పెళ్లి చేసేవారు. ఆ తరువాత ప్రేమ వివాహాలు ఎక్కువ అయ్యాయి.
Ads
కొన్నేళ్ళ నుండి లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ క్రమంలో వయసు ముప్పై నలబై దాటుతోంది కూడా. కానీ కొందరు పురుషులు మాత్రం 50 దాటిన పెళ్లి గురించి ఆలోచించకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. మగవారు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మగవారు వివాహం చేసుకోకుండా ఎందుకు ఒంటరిగా ఉంటారనే విషయం జరిగిన అధ్యయనంలో పలు కారణాలు బయటకు వచ్చాయి. ఈ అధ్యయనం 35 సంవత్సరాలు పైబడిన పెళ్లికానీ మగవారి పై నిర్వహించారు. పురుషులు పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. కొందరు మగవారు రిలేషన్స్ నమ్మరు. వారి చుట్టూ ఉన్న పెళ్లిచేసుకున్న జంటల మధ్య జరిగే గోడవలు, విసుగు చూసి, వివాహం చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కొందరు పురుషులు కొన్ని సిద్ధాంతాలను అధికంగా నమ్ముతారు. ఆ కారణం వల్ల వారికి వివాహం జరగదు. ఈ కేటగిరికి చెందినవారు రిలేషన్, ప్రేమ, ప్రేయసి, పెళ్లికి ప్రాధాన్యతను ఇవ్వరు. మరికొందరు ఒంటరిగా జీవిస్తారు. వారికి వారే తాము అందంగా లేమని ఫీల్ అవుతుంటారు. అందువల్ల ఏ అమ్మాయి వారిని వారిని ఇష్టపడదని అనుకుని, పెళ్లికి దూరంగా ఉంటారు.
కొందరు పురుషులు పెళ్లి జరిగిన తర్వాత ఎదురయ్యే సమస్యలను ముందే ఊహించుకుని పెళ్ళి చేసుకోకుండా అవివాహితులుగానే ఉంటున్నారు. కొందరు తమ లైఫ్ పార్టనర్ ఎంచుకోవడంలో చెడు అనుభవం ఎదురు అవడం వల్ల పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అవుతుంటారు. కొందరు పురుషులు ప్రేమించి, లవర్ తో బ్రేకప్ అవడం వల్ల బాధలో ఉండిపోతారు. రకరకాల కారణాల వల్ల తమ ప్రేమలో ఓడిపోయినపుడు వారు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారని ఆ అధ్యయనంలో వెల్లడించారు.
Also Read: స్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!