తిరుమలలో స్వామివారి గర్భగుడి తలుపులు తీసేది వీళ్ళే.. వాళ్లు మాత్రమే ఎందుకు తెరుస్తారో తెలుసా!

Ads

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్నో అద్భుతాల సంగమం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఈ గుడిలో ఉన్నన్ని వింతలు మరే గుడిలోని కనిపించవు. అందులో ఒకటి దేవాలయం తలుపులు తెరవటం. మామూలుగా ఏ దేవాలయంలో అయినా దేవాలయం తలుపులను ఆలయ అర్చకులు తీస్తారు.

కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయద్వారం తీసేది మాత్రం ఒక యాదవుడు. ముందు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే రోజు వారి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇందుకు గల కారణం ఏమిటో ఎవరికైనా తెలుసా లేదంటే తెలుసుకోండి. వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఒక పుట్టలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికి బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడలుగా మారి చోళరాజు గో సంపదలో చేరుతారు.

Ads

ఆవు దూడన ని చూసి ముచ్చటపడిన చోళ రాణి గోవుపాలు ప్రతిరోజు తనకిమ్మని పశువుల కాపరిని ఆదేశిస్తుంది. అయితే ఆ ఆవు మందతో పాటు మేతకు వెళ్లి పక్కనే ఉన్న పుట్టలో ఉన్న శ్రీనివాసునికి పాలు జారవిడిచేది. ఇంటికి వచ్చిన తర్వాత యాదవుడు పాలు పితికితే పాలు వచ్చేవి కాదు. దీంతో రాణి ఆగ్రహ పడుతుంది. ఆవు ఒకరోజు పుట్టలో పాలు ధారగా విడిచిపెట్టటాన్ని చూస్తాడు యాదవుడు. పట్టరాని ఆగ్రహంతో ఆ గోవుని కొట్టబోతాడు అప్పుడే శ్రీనివాసుడు ప్రత్యక్షం అవుతాడు.

భూలోకంలో మొదటిసారిగా తనని దర్శించిన యాదవ వంశీయులకే తన తొలి దర్శనం లభిస్తుందని శ్రీనివాసుడి వరం ఇస్తాడు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో రెండున్నర గంటలకి సుప్రభాత సేవకు ముందు సన్నిధి గొల్ల సుచిత్ నాధుడే తిరునామం ధరించి గోవింద నామాన్ని స్మరిస్తూ దివిటీ పట్టుకుని ఉత్తర మాడ వీధుల్లో అర్చకుల తిరుమాళ్ళకు వెళ్లి వారికి నమస్కరించి వాళ్ళని ఆలయానికి ఆహ్వానిస్తాడు. ఇలాంటి గత వైభవ చిహ్నాలుఎన్నో తిరుమల తిరుపతిలో కోకొల్లలు ఉంటాయి.

Previous article30 ఏళ్ళు దాటిన మహిళలు రోజూ వీటిని తప్పక తీసుకుంటే… అనారోగ్య సమస్యలే వుండవు..!
Next articleసొంత జెట్ విమానాలున్న టాలీవుడ్ హీరోలు వీరే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.