Ads
చాలామంది నటీ నటులు ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఉంటారు. అలానే యాడ్ల ద్వారా కూడా వారికి ఎక్కువ డబ్బులు వస్తాయి. దీనితో ఖరీదైన దుస్తుల్ని, కార్లని కొనుగోలు చేయడం.. బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీదాదాపు అందరు నటులు చేసేదే. కానీ కొందరు నటులకి మాత్రం ఏకంగా జెట్ విమానాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే ఎలా వీటిని మెయింటెన్ చేస్తారు అని… అయితే ఈ జెట్ విమానాల్ని ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేస్తూ ఉంటారు.
అక్కడ సిబ్బంది వీటి మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఉంటారు. జెట్ విమానాల ఓనర్లు ఇందుమేరకు ఒప్పందం కుదుర్చుకుంటారు. దీనికోసం వాళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా వీళ్ళు అనుమతి ఇస్తే వీటిని ఇతరులకి రెంట్ కి కూడా ఇస్తూ ఉంటారు. ఈ నలుగురు హీరోలకి ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయట. మరి ఆ హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
#1. అల్లు అర్జున్:
Ads
అల్లు అర్జున్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. పుష్ప 2 ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. అయితే బన్నీ తన పెళ్లి తర్వాత ఫ్యామిలీ కోసం సొంతంగా జెట్ ఫ్లైట్ ని కొనుగోలు చేశారు.
#2. చిరంజీవి:
చిరంజీవి కూడా ఒక జెట్ విమానాన్ని కొనుగోలు చేశారు. అయితే ఈ జెట్ విమానం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 80 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ జెట్ విమానాన్ని ఫ్యామిలీ టూర్ కోసం ఉపయోగిస్తారు.
#3. నాగార్జున:
నాగార్జున కి కూడా ఒక ఫ్లైట్ ఉంది. వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ ఫ్లైట్ మీద వెళ్తారు.
#4. జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒక జెట్ ఫ్లైట్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ దీనిని 80 కోట్లు పెట్టి కొన్నారట.
Also Read: ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి చేతిరాతని చూసారా..? అచ్చం ప్రింటింగ్ లాగే వుంది..!