Ads
నయనతార హీరోయిన్ గా నటించిన అన్నపూరణి సినిమా మీద రోజుకి ఒక వివాదం చుట్టుముడుతోంది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఒక సాధారణ యువతి ఒక పెద్ద చెఫ్ గా ఎలా ఎదిగింది అనే విషయం మీద సినిమా నడుస్తుంది.
అయితే సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా, తెరకెక్కించడంలో చూపించిన కొన్ని విషయాలు వివాదాస్పదం అయ్యాయి. వివరాల్లోకి వెళితే, ఈ సినిమాలో హీరోయిన్ ఒక సంప్రదాయమైన శాకాహార కుటుంబంలో పుడుతుంది. హీరోయిన్ తండ్రి గుడిలో స్వామి వారికి నైవేద్యం చేస్తారు.
అయితే, హీరోయిన్ కి టేస్ట్ కొంచెం ఎక్కువగా తెలిసే ఒక ప్రత్యేకత ఉంటుంది. దాంతో చిన్నప్పటి నుండి ఏ వంట పదార్ధం ఎలా ఉంది? అందులో వాడిన పదార్ధాలు ఏంటి? అనేది కళ్ళు మూసుకొని చెప్పగలిగే టాలెంట్ ఉంటుంది. ఈ కారణంగానే చిన్నప్పటి నుండి వంటల మీద ఆసక్తి ఉండడంతో పెద్దయ్యాక చెఫ్ అవ్వాలి అనుకొని, ఇంట్లో వద్దన్నా కూడా తన ఇంట్లో వారికి ఎంబీఏ చేస్తున్నాను అని చెప్పి, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో చేరుతుంది. అక్కడ ఒక రోజు కోడిని ఎలా కోయాలి అనే విషయాన్ని నేర్పిస్తూ ఉంటారు.
Ads
పుట్టుకతో శాకాహారి అయిన అన్నపూరణి, కోడిని ముట్టుకోవడానికి ఇబ్బంది పడి, కళ్ళు తిరిగి పడిపోతుంది. బాధ పడుతూ కూర్చున్న అన్నపూరణి దగ్గరకి తన ఫ్రెండ్ ఫర్హాన్ వచ్చి, ఇది వృత్తి అని, వనవాసంలో ఉన్నప్పుడు రాముల వారు కూడా మాంసాహారం స్వీకరించారు అని చెప్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్ పైన కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అసలు రాముల వారు మాంసాహారం ముట్టుకున్నారు అని ఎలా చెప్పారు అంటూ మండిపడుతున్నారు. ఇది మాత్రమే కాదు. ఈ సినిమాలో హీరోయిన్ శాకాహారి. నియమ నిష్ఠలతో తమ ఇంట్లో కేవలం శాకాహార భోజనాన్ని తింటూ పెరుగుతుంది.
అలాంటి ఒక వ్యక్తి తన చదువు కోసం అనే ఒక కారణంతో మాంసాహారం తింటుంది. ఆ విషయాన్ని ఈ సినిమాలో సమర్ధించారు. చెఫ్స్ లో అందరూ మాంసాహారం తినే వాళ్ళు మాత్రమే ఉండరు. ఒకవేళ వాళ్ళు మాంసాహారం వండాల్సి వచ్చినా కూడా దానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటారు కానీ ఇలా అయితే చేయరు. దాంతో ధర్మాధర్మాల మీద కూడా ఈ సినిమాలో ఇచ్చిన సందేశం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. ఏదేమైనా కూడా ఈ సినిమా అయితే ప్రస్తుతం వివాదాల్లో ఉంది.
watch video :
"Ram-Lakshman-Sita used to eat meat during Vanvash" – This is what @NetflixIndia is showing in the name of art.
The anti Hindu propaganda before #RamMandirPranPratishtha is not limited to political speeches, it has reached cinema as well.
Strict action against makers is needed.… pic.twitter.com/sLk3citgip
— Mr Sinha (@MrSinha_) January 10, 2024