Ads
ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాలు పరిస్థితి ఎలా అయ్యింది అంటే… పెళ్లయిన తర్వాత ఎన్ని రోజులు సఖ్యతగా ఉంటున్నారో చెప్పలేని పరిస్థితి వచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరో ఒకరిలో లోపాలు ఉండడం సహజం. వాటిని సరిచేసుకుని ముందుకు వెళితే అది అందమైన సంసార జీవితం గా మారుతుంది.
భర్త భార్యను ఎంత అర్థం చేసుకుంటే భార్య కూడా అదే రీతిలో భర్తను అర్థం చేసుకోవాలి. ఒకరి సమస్యలు ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఏదైనా లోపాలు ఉంటే బుజ్జగించుకుని నచ్చ చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం సమాజంలో భర్తల తీరు బాగానే ఉన్నా భార్యల తీరులో మాత్రం మార్పు వచ్చింది. భార్యలు స్వేచ్ఛ స్వతంత్రం పేరుతో మితిమీరిన ప్రవర్తన చూపిస్తున్నారు. దీని కారణంగా ఆ కుటుంబంలో గొడవలు రావడం జరుగుతుంది. ఇలాంటి ఒక సమస్యనే ఎదుర్కొంటున్న ఒక బాధితుడు తన భార్య తీరును బయట పెట్టుకున్నాడు.
Ads
తన భార్య తనతో నిత్యం గొడవలు పెట్టుకునేదని.. దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చిరాకు పడుతూ ఉండేదని మొర పెట్టాడు. తనతో ప్రేమగా మాట్లాడదాం అన్నా కూడా కనీసం సహకరించేది కాదని, ఎంత ప్రేమగా చూసుకున్నా తను కష్టాలు పెడుతున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పేదని ఇలా లేనిపోని అభాండాలు తన మీద వేయడంతో తన మనసు విరిగిపోయిందని బాధపడ్డాడు. ఇలా కష్టాలు కడలిలో తన సంసార జీవితం ఏళ్లు గడిచిపోయాయని చెప్పాడు.
అయితే తన స్నేహితురాలికి పిల్లలు పుట్టగా తను కూడా పిల్లలి కనాలనుకుంటున్నట్లు చెప్పిందని, అప్పటినుండి తనకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే తనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గరికి వచ్చేదని, నేను ప్రేమగా దగ్గరికి వెళ్తే కసురుకునేదని, కేవలం పిల్లల కోసం నా దగ్గరికి వస్తుందని తెలిసి నా మనసు ముక్కలై పోయింది అని చెప్పాడు.
ప్రేమగా మనసు పంచుకోలేని భార్యతో శరీరం ఎలా పంచుకోవాలి అంటూ తన ఆవేదన బయట పెట్టాడు. సఖ్యత లేని తనకి విడాకులు ఇద్దామనుకుంటే మళ్లీ లేని ఆరోపణలు మీద వేస్తుందని భయపడుతున్నానని అన్నాడు. తనకి ఏమి చేయాలో తెలియడం లేదని ఈ సమస్య నుండి బయటపడినందుకు ఒక సలహా ఇవ్వాలని వేడుకుంటున్నాడు.